ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూ, మిలన్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో మిలన్ విలేజ్ ప్రారంభమైంది. నావల్ బేస్ లోని సముద్రిక ఆడిటోరియం వద్ద మిలాన్ విలేజ్ ఏర్పాటు చేశారు. నావికాదళ చిహ్నాలు, హస్త కళలు, చేనేత, ఆహార ఉత్పత్తులు లాంటి వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఓ రోబో కాఫీ స్టాల్ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఆకట్టుకుంది. ఇక్కడ కాపీ అందించే దాని పేరు బీన్ బోర్డు రోబో. డబ్బులు చెల్లించి నచ్చిన కాఫీ మీద నొక్కితే.. క్షణాల్లో ఆ రోబో మీకు రుచికరమైన కాఫీ చేసి పెడుతుంది. మనుషుల సహాయం లేకుండానే ఓ కప్పును తీసుకుని.. పక్కనే మెషిన్ కింద పెడుతుంది. రోబో సెన్సార్లతో అనుసంధానమైన మెషిన్.. కాఫీ సిద్ధం చేస్తుంది. తయారైన కాఫీని ఆ కప్పులో పట్టి ఆ రోబో స్వయంగా చేతితో అందిస్తుంది.
ఆరు రకాల కాఫీ, టీ..!
ఈ బీన్ బోర్డ్ రోబో.. నాలుగు రకాల కాఫీలు, రెండు రకాల టీలను సిద్ధం చేస్తుంది. కాఫీల్లో కేపు చినో, లాటే, ఎస్ప్రెస్సో, అమెరికానో (బ్లాక్ కాఫీ) కూడా మీకు వేడి వేడిగా మీ కళ్ళ ముందే మేక్ చేసి మీకు అందిస్తుంది. అలాగే మరో రెండు వెరైటీల ఐస్ టీ లను కూడా తయారు చేస్తుంది ఈ రోబో. దీంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రోబోను చూసి ఆశ్చర్యపోయారు. అది పెట్టి ఇచ్చిన కాఫీ తాగి కాంప్లీమెంట్స్ కూడా ఇచ్చారు.
అయితే త్వరలో ఇలాంటి రోబోలను ఎయిర్ పోర్ట్స్ లలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని బీన్ బోర్డు ప్రతినిధి ఐజాక్ జెరిమయ తెలిపారు. దిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్స్ లో వీటని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రష్యా నుంచి స్పేర్స్ పార్ట్స్ తీసుకొచ్చి తామే తమకు తగ్గట్టుగా ఈ కాఫీ రోబోను ఇన్‌స్టాల్ చేస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖ నుంచి ఏషియా, యూరోపియన్ కంట్రీస్ కి కాఫీ రోబో స్ ను సప్లై చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

