Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Abhishek vs Travis vs Salt vs Nissanka: టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?

18 February 2026

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై నాణ్యమైన లడ్డూ.. టీటీడీ కొత్త రూల్స్.. ఇక అలా కుదరదు..

18 February 2026

Tollywood : స్విమ్ సూట్ ధరించిన ఫస్ట్ హీరోయిన్.. ఒక్కసారిగా మారిన క్రేజ్.. చివరకు కన్నీటి విషాదం..

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd On Tirumala Srivari Laddu Quality,తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.. నిబంధనల్ని మార్చేశాం.. టీటీడీ కీలక ప్రకటన – no compromise on the quality of tirumala srivari laddu ttd released press note
ఆంధ్రప్రదేశ్

Ttd On Tirumala Srivari Laddu Quality,తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.. నిబంధనల్ని మార్చేశాం.. టీటీడీ కీలక ప్రకటన – no compromise on the quality of tirumala srivari laddu ttd released press note

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd On Tirumala Srivari Laddu Quality,తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.. నిబంధనల్ని మార్చేశాం.. టీటీడీ కీలక ప్రకటన – no compromise on the quality of tirumala srivari laddu ttd released press note
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD On Tirumala Laddu Quality: తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపింది టీటీడీ. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి రవాణాలో నాణ్యత దెబ్బతినకుండా కొన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అందుకే నెయ్యి సేకరణ పరిధిని 1,500 కి.మీ. నుంచి 800 కి.మీ.కు తగ్గించాము అన్నారు. అలాగే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్‌ లాక్‌ సిస్టమ్‌ తప్పనిసరి చేశామన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు, వాస్తవాలను టీటీడీ తెలిపింది.

హైలైట్:

  • తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన
  • నెయ్యి విషయంలో నిబంధనలు మార్చామన్నారు
  • ఆరోపణలు, వాస్తవాలు అంటూ టీటీడీ కీలక అంశాలు
Tirumala Srivari Laddu
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత , పవిత్రత కాపాడతామని.. నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేసినట్లు టీటీడీ తెలిపింది. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ‘ఆవు నెయ్యి కొనుగోలుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం బాధాకరం. KMF (నందిని) కేవలం 10 లక్షల కేజీలే సరఫరా చేయగలమని తెలిపిన కారణంగానే దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచాం. KMF నుంచే ₹716.92కి నెయ్యి కొనుగోలు జరిగింది. అధిక ధరల ఆరోపణలు అవాస్తవం. వైసీపీ రాజకీయ కుట్రను ప్రజలకు పూర్తిగా వివరిస్తాం’ అని టీటీడీ తెలిపింది.’2024కి ముందు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత మరియు రుచిపై వచ్చిన విమర్శలు, భక్తుల అనుమానాలను పరిగణనలోకి తీసుకుని, బీ.ఆర్ నాయుడు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన TTD బోర్డు నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టడం జరిగింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు, గతంలో ఉన్న 1500 కి.మీ.ల సేకరణ పరిధిని 800 కి.మీ.లకు తగ్గించడం జరిగింది. నెయ్యి రవాణా చేసే ట్యాంకర్లకు తప్పనిసరిగా GPS లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. డైరీ ప్రాసెసర్ల తయారీ సిద్ధతను అంచనా వేసేందుకు MRL స్కోర్ బోర్డ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. FSSR 2.1.8 నిబంధనలతో పాటు, మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ పరీక్షలను (ISO 17678:2019) మరియు సెన్సరీ పారామీటర్స్ (IS Code: 7770:1975) కఠినతరం చేయడం జరిగింది’ అన్నారు.

‘2024 నుండి 2025 మధ్య కాలంలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా 7 విడతలుగా టెండర్లు నిర్వహించి, పారదర్శకంగా మొత్తం 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 7 ప్రముఖ డైరీ సంస్థలు పాల్గొన్నాయి. 1.⁠ ⁠నందిని (KMF) – 4 టెండర్లు దక్కించుకుంది. 2.⁠ ⁠మదర్ డైరీ – 2 టెండర్లు దక్కించుకుంది. 3. ఇందాపూర్ డైరీ – 2 టెండర్లు దక్కించుకుంది. 4.⁠ ⁠సంగం డైరీ – 1 టెండర్ దక్కించుకుంది. 5.⁠ ⁠ప్రీమియర్ అగ్రి డైరీ – టెండర్ దక్కలేదు. 6.⁠ ⁠కొల్హాపూర్ డైరీ (గోకుల్) – టెండర్ దక్కలేదు. 7.⁠ ⁠గోవింద్ మిల్క్ – టెండర్ దక్కలేదు’ అన్నారు.

‘నందిని డైరీని (KMF) తప్పించారు. వాస్తవానికి 2024 నుండి నందిని (KMF) డైరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదు. మొత్తం 7 టెండర్లలో 4 టెండర్లను నందినీ డైరీ దక్కించుకుంది. 11-2024 బోర్డు http://Res.No.16 – 10 లక్షలు కేజీలు – 495 రూ. 01-2025 బోర్డు http://Res.No.182 – 20 లక్షలు కేజీలు – 513 రూ. 05-2025 బోర్డు http://Res.No.292 – 10 లక్షలు కేజీలు – 600 రూ. 10-2025 బోర్డు http://Res.No.484 – 20 లక్షల కేజీలు – 716.92 రూ (దీనిలో 10 లక్షల కేజీల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలియచేసింది). మొత్తంగా 40 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు నందిని డైరీ (KMF) టెండర్లను దక్కించుకుని ప్రస్తుతం అవసరమైన నెయ్యిలో 62% సరఫరా చేస్తోంది. గతంలో 2019-24 మధ్య నందినీ డైరీకి ఎటువంటి టెండర్లు ఇవ్వలేదు’ అని తెలిపారు.

‘ఇందాపూర్ డైరీకి మాత్రమే టెండర్ ఇచ్చారని ఆరోపించారు. కేవలం ఇందాపూర్ డైరీకే టెండర్లు ఇచ్చారనేది అవాస్తవం. 7 టెండర్లలో ఈ సంస్థ కేవలం 2 టెండర్లను.. 12- 2025 బోర్డు http://Res.No. 590- 6.5 లక్షలు కేజీలు – 658 రూ.. 12- 2025 బోర్డు http://Res.No.605 – 3.5 లక్షలు కేజీలు – 657 రూ. మాత్రమే దక్కించుకుని మొత్తంగా 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ముందుకు వచ్చింది. ఇతర డైరీ సంస్థలకు అవకాశం ఇవ్వలేదు. టెండర్లలో పైన పేర్కొన్న ఏడు డైరీలు పాల్గొన్నాయి. వీటిలో నాణ్యత ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన నందిని, మదర్ డైరీ, సంగం మరియు ఇందాపూర్ డైరీలకు ఆర్డర్లు కేటాయించడం జరిగింది. 2016లో ఆవు పాల ధర రూ.17 నుండి రూ.20 మధ్య ఉన్నప్పుడు ఆవు నెయ్యి ధర రూ.278గా ఉండేది. ప్రస్తుతం ఆవు పాల ధర రూ.42 కు (సుమారు 147% పెరిగింది) చేరడంతో, ఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా దానికి అనుగుణంగా ఇప్పుడు రూ.658 (సుమారు 137% పెరిగింది) కు పెరిగాయి. ఇతర డైరీ సంస్థలు కూడా ఇంచుమించు ఎక్కువ ధరలను కోట్ చేయడం గమనార్హం’ అన్నారు.

‘కమీషన్ల కోసం రేటు పెంచారని ఆరోపించారు. సగటు NCDFI ఆవు వెన్న ధర, దేశవ్యాప్త ఆవు నెయ్యి హోల్‌సేల్ మార్కెట్ (NCDFI & IDA) పరిస్థితులను పరిశీలించి NDDB నిపుణులు సూచించే ధరలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పరిధి మీరి కట్టబెట్టారని ఆరోపించారు. వాస్తవంగా పెరిగిన ధరల వల్ల నందిని డైరీ అవసరమైన (బోర్డు http://Res.No.484) 20 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయలేమని, కేవలం 10 లక్షల కిలోలను మాత్రమే సరఫరా చేయగలమని తెలియజేయటంతో సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి రవాణా పరిధిని దాటి L2 గా నిలిచిన జాతీయ స్థాయి డైరీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. 2019-24 మధ్య ఇందాపూర్ డైరీ టెండర్లలో పాల్గొనలేదు.. 2019-24 మధ్య ఇందాపూర్ డైరీ 6 సార్లు టెండర్లలో పాల్గొన్నది. టెండర్ దక్కించుకున్న అన్ని డైరీ కంపెనీలు FSSAI & NDDB నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు నెయ్యి ధర కూడా NDDB నిపుణులు సూచించిన ప్రకారం అత్యంత పారదర్శకంగా టెండర్ కేటాయింపులు జరిగాయి. టీటీడీ బోర్డు ఎల్లవేళలా శ్రీవారి ప్రసాదాల యొక్క నాణ్యతను, పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది’ అని టీటీడీ తెలిపింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి