Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra: వాడు మనిషి కాదు మృగం.. ఇంటి పక్కనే ఉంటూ.. మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో సంచలన నిజం

18 February 2026

Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

18 February 2026

Ramadan 2026: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రంజాన్‌ మాసం మొత్తం గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ బాడీ షేప్ సీక్రెట్ ఈ వర్కవుట్స్‌.. నిపుణుల హెచ్చరిక ఏంటంటే?
తాజా వార్తలు

జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ బాడీ షేప్ సీక్రెట్ ఈ వర్కవుట్స్‌.. నిపుణుల హెచ్చరిక ఏంటంటే?

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ బాడీ షేప్ సీక్రెట్ ఈ వర్కవుట్స్‌.. నిపుణుల హెచ్చరిక ఏంటంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఇది కేవలం ఒక డ్యాన్స్ మాత్రమే కాదు, శరీరాన్ని ఉక్కులా మార్చే ఒక గొప్ప వ్యాయామం అని ఆమె నిరూపిస్తోంది. సామాన్యులకు ఇది కొంచెం కష్టంగా అనిపించినా, సరైన పద్ధతిలో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ గ్లామర్ బ్యూటీ మరెవరో కాదు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. పోల్ డ్యాన్స్ ద్వారా ఆమె పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఈ వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం..

ఒక సంపూర్ణ వ్యాయామం..

జస్లోక్ హాస్పిటల్ కు చెందిన ఫిజియోథెరపీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. పోల్ డ్యాన్స్ అనేది ఒక అద్భుతమైన ఫిట్‌నెస్ డిసిప్లిన్. ఇది కేవలం వినోదం కోసం చేసేది కాదు, దీనివల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇది శరీరంలోని మధ్య భాగాన్ని అత్యంత దృఢంగా మారుస్తుంది. చేతులు, కాళ్లు, భుజాల కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. శరీరం రబ్బరులా వంగేలా చేస్తుంది.

దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీర సమతుల్యతను పెంచి, మనం నడిచే తీరును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సంగీతంతో కలిసి ఈ వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి వయసు వారు దీనిని ప్రయత్నించవచ్చని, ఇది శరీర అవగాహనను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, వారి వ్యక్తిగత ఎదుగుదలకు ఈ పోల్ డ్యాన్స్ ఎంతో దోహదపడుతుంది.

పాటించాల్సిన నియమాలు

పోల్ డ్యాన్స్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి

  • ఏదైనా కఠినమైన మూమెంట్స్ చేసే ముందు శరీరంలోని అన్ని కీళ్లను వార్మ్-అప్ చేయాలి.
  • శరీర బరువును కేవలం చేతులతో మోయాల్సి ఉంటుంది కాబట్టి, ముందే కండరాలను సిద్ధం చేసుకోవాలి.
  • సర్టిఫైడ్ థెరపిస్ట్ లేదా ట్రైనర్ సలహాతోనే ఈ వ్యాయామాన్ని ప్రారంభించాలి.
  • కింద పడినా దెబ్బలు తగలకుండా క్రాష్ మాట్స్ ఉపయోగించాలి.
  • అలసట వల్ల వచ్చే నొప్పికి, నరాల బలహీనత వల్ల వచ్చే నొప్పికి మధ్య తేడాను గుర్తించాలి.

చేయకూడని పనులు

  • శరీరంలో ఎక్కడైనా పదునైన నొప్పి ఉన్నప్పుడు బలవంతంగా ఈ వ్యాయామం చేయకూడదు.
  • గాల్లోకి ఎగిరి చేసే విన్యాసాలను నేర్చుకునేటప్పుడు తొందరపడకూడదు.
  • చేతులకు లేదా ఒంటికి లోషన్లు రాసుకుంటే స్తంభం పట్టుకోవడం కష్టమవుతుంది, జారిపడే ప్రమాదం ఉంది.
  • అతిగా వ్యాయామం చేయడం వల్ల కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది.

వెన్నెముక సమస్యలు, కీళ్ల నొప్పులు, శరీర సమతుల్యత సరిగా లేనివారు మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు పోల్ డ్యాన్స్ కు దూరంగా ఉండటం లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే చర్మం సెన్సిటివ్ గా ఉన్నవారు, పాత గాయాల నుంచి కోలుకుంటున్న వారు కూడా ఈ వ్యాయామం చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాగా ఫిట్‌గా ఉండాలని ఎవరికి ఉండదు? కానీ అలాంటి బాడీని సాధించడానికి ఆమె పడే కష్టం, చూపే క్రమశిక్షణే ఆమెను ఈరోజు ఫిట్‌నెస్ ఐకాన్ గా నిలబెట్టాయి. పోల్ డ్యాన్స్ అనేది ఒక కొత్త ట్రెండ్ మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి మంచి ఔషధం కూడా అంటున్నారు నిపుణులు.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

18 February 2026

Ramadan 2026: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రంజాన్‌ మాసం మొత్తం గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!

18 February 2026

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్

18 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Andhra: వాడు మనిషి కాదు మృగం.. ఇంటి పక్కనే ఉంటూ.. మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో సంచలన నిజం

18 February 2026

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం నెలకొంది. మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారింది. అదృశ్యమైన బాలిక హత్యకు…

Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

18 February 2026

Ramadan 2026: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రంజాన్‌ మాసం మొత్తం గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!

18 February 2026

Ap Govt Medical Colleges Associate Professors Promotions,ఏపీలో ఉద్యోగులకు ప్రమోషన్లు.. రెండు శాఖల్లో వారికి పండగే, ఉత్తర్వులు జారీ – andhra pradesh government promotions for medical colleges and teaching hospitals associate professors

18 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra: వాడు మనిషి కాదు మృగం.. ఇంటి పక్కనే ఉంటూ.. మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో సంచలన నిజం

18 February 2026

Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

18 February 2026

Ramadan 2026: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రంజాన్‌ మాసం మొత్తం గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!

18 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.