Madanapalle Girl Murder Case Accused Died In Pond: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని కురబాలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో గుర్తించారు. ముదివేడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కులవర్ధన్ నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు.. చివరికి శవమై తేలాడు.
హైలైట్:
- మదనపల్లె బాలిక హత్యకేసు నిందితుడి ఆత్మహత్య
- చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న కులవర్ధన్
- కనసానివారిపల్లి చెరువులో నిందితుడి మృతదేహం

పోలీసులు బాలిక కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసించే కులవర్దన్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాలికను గొంతు నులుమి హత్య చేసి.. మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు.
కులవర్ధన్ తల్లితో కలిసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.. ఆమె ఓ స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్నారు. కులవర్ధన్ ఖాళీగా ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. అతడికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతడు ఒకరిపై కొడవలి తీసుకుని దాడి చేయగా.. కేసు కూడా నమోదైంది. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. కులవర్ధన్ బాధిత మహిళల్ని బెదిరించడంతో వారు కేసులు వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో అతడిని పోలీసులు హెచ్చరించారు. కులవర్ధన్ ఇంటి దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు.. అతడ్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. .
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.. వెంటనే నిందితుడ్ని పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే బాలిక తండ్రితో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్‌లో మాట్లాడారు. అలాగే రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లెకి స్వయంగా వెళ్లారు.. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఈ ఘటన తర్వాత కులవర్ధన్ పరారయ్యాడు.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఈ క్రమంలో అతడి మృతదేహాన్ని చెరువులో గుర్తించారు.


