భారత దేశం స్విట్జర్లాండ్ నుంచి అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇండియాకు బంగారం దిగుమతి చేసే దేశంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 2024 నుంచి 2026 వరకు ఈ దేశం భారత దేశానికి దాదాపు రూ. 1,77,767.10 కోట్ల బంగారాన్ని దిగుమతి చేయడం జరిగింది.
అదేవిధంగా భారత దేశం బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ స్థానంలో ఉంది. ఈ దేశం భారత దేశానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 1,46,022.98 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసింది.
దక్షిణా ఫ్రికా భారత్‌కు బంగారం దిగుమతి చేసే దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఈ దేశంలో అత్యధిక బంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారు గనులు ఎక్కువగా ఉన్న దేశల్లో ఇది టాప్ 5లో ఉంటుంది. అయితే భారత్ దక్షిణాఫ్రికా నుంచి దాదాపు రూ.57,592.91 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.
భారత దేశానికి అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసే దేశాలలో పెరూ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ దేశం నుంచి భారత్ దాదాపు రూ. 38,183.65 కోట్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.
ఇక చివరగా ఇండియాకు అత్యధిక బంగారం దిగుమతి చేసే దేశాలలో ఆస్ట్రేలియా ఐదవ స్థానంలో ఉంది. అత్యధిక బంగారు గనులు ఉన్న దేశంలో ఇది మొదటి స్థానంలో ఉంది. అయితే ఆస్ట్రేలియా నుంచి ఇప్పటి వరకు భారత దేశం దాదాపు. రూ. 27,118.55 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.






