తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం షూటింగ్‌లతో సందడిగా ఉంది. ఒకరిద్దరు మినహా దాదాపు అందరు హీరోలు, ముఖ్యంగా స్టార్ హీరోలు, తమ సినిమా లొకేషన్లలో నిమగ్నమై ఉన్నారు. సంక్రాంతి హీరోలు సైతం తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. హలో నేటివ్ స్టూడియోలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్, సమంత మా ఇంటి బంగారం, జేడీ చక్రవర్తి కొత్త సినిమా, శర్వానంద్ భోగి చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. దాసరి కళ్యాణ్ అధీర సినిమా సెట్ పనులు కూడా అక్కడే జరుగుతున్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ దండు మైలారంలో, మహేష్ బాబు వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్‌గా సాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా
సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్.. చమురు స్మగ్లింగ్‌కు చెక్
బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

