నిండు నూరేళ్లు తోడుంటానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి వివాహమాడిన అర్ధాంగి అర్ధాంతరంగా చనిపోయింది. భార్య దూరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. భార్య సమాధి పక్కనే సమాధి ఉండాలని బావించాడు. బతికుండగానే తన సమాధి కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఓ భర్త. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య తన భార్య అనారోగ్యంతో చనిపోయింది. అయితే వీరికి సంతానం లేకపోవడంతో మల్లయ్య తన మరణానంతరం తన భార్య రాజవ్వ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బతికుండగానే తన భార్య సమాధి పక్కనే తన సమాధి కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పాడు తన భార్య సమాధి పక్కనే ఏర్పాటు చేసుకున్న సమాధిలోని తనను ఖననం చేయాలన్నాడు. మల్లయ్య అనాధ కావడంతో అల్లిపూర్ బస్ షెల్టర్‌లో నివాసం ఉంటున్నాడు. సుల్తానాబాద్‌కు చెందిన అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి రిటైర్డ్ ఉపాధ్యాయులు ప్రతినెల 1000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. దాంతో మల్లయ్య జీవనం కొనసాగిస్తున్నాడు. ఎవరు లేకపోవడంతో చనిపోయిన తరువాత ఇక్కడే పాతి పెట్టాలని కోరుతున్నాడు. ప్రతి రోజు సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొద్దీ సేపు ఉంటాడు. భార్య చనిపోయి చాలా ఏళ్ళు దాటినా ఆమెపై ప్రేమ తగ్గలేదు.

