Balakrishna New House In Hindupur,హిందూపురంలో ఇల్లు కట్టుకుంటున్న బాలయ్య.. భూమిపూజ పూర్తి – nandamuri balakrishna conducts bhumi puja to construct new house at hindupur
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సొంతిళ్లు కట్టుకోబోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య సొంత నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉంటూ హిందూపురంలో పాలన చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలను సీరియస్‌గా తీసుకున్న బాలయ్య.. ప్రత్యర్థులకు అలాంటి అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. హిందూపురం సమీపంలోని వనం కాలనీలో 81 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో బాలయ్య ఇంటిని నిర్మిస్తున్నారు.