ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు. వాటిని రుచి చూసిన మంత్రి అనిత ఇష్టంగా తిన్నారు. ఇంకేముంది వాటి టేస్ట్‌కు ఫిదా అయ్యారు.
దీంతో స్వయంగా ఆమె ఆ షాప్ లోకి వెళ్లి.. కొద్దిసేపు బజ్జీలు వేశారు. వేడి వేడి నూనెలో శెనగ పిండిలో కలిపిన అరటి, మిర్చి బజ్జిలను వేసి వేయించ్చారు. ఇలా ఎకంగా హోంమంత్రినే తమ దుకాణానికి రావడం, బజ్జిలు తినడమే కాకుండా, బజ్జీలు వేయడంతో ఆ దుకాణదారుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతేకాదు ఆ దృశ్యాలు చూసిన వారంతా చూస్తూ ఉండిపోయారు.
మరికొందరైతే మంత్రి బజ్జీలు వేస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అంతేకాకుండా సమీపంలోని ఓ పాన్ షాప్‌లోకి వెళ్లిన మంత్రి అక్కడి వ్యాపారులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి వ్యాపార పరిస్థితులు, సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

