
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు తరచూ గొడవలు దిగుతున్నారు. ఈ క్రమంలో భార్యను హతం చేయాలని భర్త భావించాడు. దీంతో గ్రామ శివారుకి తీసుకెళ్లి ఇష్టమొచ్చిన విధంగా కొట్టాడు. ఆ తర్వాత.. ఆమె చనిపోయిందని అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఆమె కనబడకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ప్రస్తుతం కోలుకుంటుంది.. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది.. భార్యను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశాడు భర్త. మొదటి భార్య నూనె పద్మను జాఫర్ ఖన్ పేట శివారుకు తీసుకువెళ్లి బండరాయితో తలపై మోది.. గాయపరిచి చనిపోయిందని భావించి ముళ్ల పొదల్లో పడేసి పరారయ్యాడు భర్త నూనె వెంకటేష్..
పద్మ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో భర్త వెంకటేష్ పై అనుమానం ఉందని పద్మ తండ్రి మల్లయ్య ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వెంకటేష్ ను అదుపులోకీ తీసుకొని విచారించగా, జఫర్ ఖన్ పేట శివార్లోకి తీసుకువెళ్లి బండరాయితో కొట్టి చంపానని ఒప్పుకున్నాడు భర్త వెంకటేష్.. పోలీసులు జఫర్ ఖన్ పేట గుట్టకు వెళ్లి మృతదేహం కోసం వెతికిన పోలీసులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పద్మను హటావుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కి తరలించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకొని సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో పద్మ ప్రాణాలు దక్కాయి.
మంచిర్యాలకు చెందిన పద్మను 15 సంవత్సరాల క్రితం వెంకటేష్ తో వివాహం జరగగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత ఏడేండ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. మొదటి భార్య వద్దని, రెండవ పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టాడు భర్త వెంకటేష్.. నిన్న కోర్టులో కేసు ఉండడంతో భర్త వెంకటేష్ మొదటి భార్య పద్మ కోర్టుకు వెళ్ళగా కోర్టు ముగిశాక మాట్లాడుకుందాం.. అని చెప్పి, పద్మను బైక్ పై ఎక్కించుకొని వెళ్లి ఈఘాతుకానికి ఒడిగట్టాడు భర్త వెంకటేష్.. నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పెద్దపల్లి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
