Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay Deverakonda – Rashmika Mandanna : ఇట్స్ అఫీషియల్.. మా పెళ్లి వేడుకకు ఇదే పేరు.. విజయ్, రష్మిక అధికారిక ప్రకటన..

22 February 2026

IND vs SA : సఫారీ చేతిలో చిత్తైన భారత్.. సూపర్-8 ఆరంభంలోనే షాక్!

22 February 2026

Kanipakam Antharalayam Photo,కాణిపాకం ఆలయంలో అపచారం.. తెలియక చేశానన్న మహిళ.. – dishonor in kanipakam devotees take photos in antharalayam

22 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Twins In Tirupati,ఒకేచోట వందమంది కవలలు.. తిరుపతిలో ఖుషీ సీన్ రిపీట్.. డబుల్ ధమాకా.. – twins create a buzz in tirupati on the occasion of international twins day
ఆంధ్రప్రదేశ్

Twins In Tirupati,ఒకేచోట వందమంది కవలలు.. తిరుపతిలో ఖుషీ సీన్ రిపీట్.. డబుల్ ధమాకా.. – twins create a buzz in tirupati on the occasion of international twins day

.By .22 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Twins In Tirupati,ఒకేచోట వందమంది కవలలు.. తిరుపతిలో ఖుషీ సీన్ రిపీట్.. డబుల్ ధమాకా.. – twins create a buzz in tirupati on the occasion of international twins day
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో ఆదివారం రోజున కవలలు సందడి చేశారు. ఒకరూ, ఇద్దరు కాదు సుమారుగా వందమంది కవలలు ఒకే డ్రెస్సుతో కనిపించి సందడి చేశారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో అంతర్జాతీయ కవలల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరందరూ పాల్గొని ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమం చూడటానికి వచ్చినవారు కూడా ఆశ్చర్యపోయారు.

Twins In Tirupati
తిరుపతిలో సందడి చేసిన కవలలు(ఫోటోలు– Samayam Telugu)
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ సినిమా చూశారా.. అందులో క్లైమాక్స్ గుర్తుందా.. పవన్ కళ్యాణ్, భూమిక కవల పిల్లలతో కనిపిస్తారు. ఒకరిద్దరు కాదు.. పదుల సంఖ్యలో కవల పిల్లలు అక్కడ కనిపిస్తారు. ఇలాంటి దృశ్యమే ఆదివారం రోజున ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కనిపించింది. ఒకే పోలిక, ఒకే రూపంతో ఉన్న సుమారుగా వంద మంది కవలలు తిరుపతిలో సందడి చేశారు. అంతర్జాతీయ కవలల దినోత్సవం (World Twins Day) సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కవలలు సందడి చేశారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయం ఇందుకు వేదికైంది.

ఈ కార్యక్రమానికి హాజరైన జనం ఇంతమంది కవలలను ఒకచోట చూసి ఆశ్చర్యపోయారు. ఒకే రూపం, ఒకే డ్రస్సుతో ఉన్న చిన్నారులు, యువతను చూసి ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో భాగంగా కవలలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. కేవలం వేడుకలకే కాకుండా, పాఠశాలల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల కవలలు తమ బాధ్యతను చాటుకున్నారు.

కవలల ప్రయాణం తల్లిగర్భంలో ఒకేసారి, ఒకే రూపంతో మొదలవుతుంది. ఈ ప్రపంచంలోకి కొన్ని క్షణాల వ్యవధిలో అడుగు పెడతారు. ఒకే రూపు, ఒకే ముఖ కవళికలతో ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ఇక సైన్స్ ప్రకారం ఫలదీకరణ సమయంలో వచ్చే మార్పులే కవలల జననానికి కారణమని వైద్యులు చెప్తుంటారు.కవలలో ఇద్దరూ మగ పిల్లలు అయినా ఉండొచ్చు. లేదా ఇద్దరూ ఆడ పిల్లలు అయినా కావచ్చు. రెండు శుక్ర కణాలు ఏర్పడి జన్మించే కవల పిల్లలను డై జైగోటిక్‌ లేదా బైనోవిలార్‌ ట్విన్స్‌ అని పిలుస్తారు.

కవలల దినోత్సవం ఎలా వచ్చిందంటే..

పోలెంద్‌లో 1976లో కవలల దినోత్సవం తొలిసారిగా నిర్వహించారు.మోజెస్, విల్‌కాక్స్‌ అనే ఇద్దరు కవల సోదరులు తాము ఉంటున్న ప్రాంతానికి ‘ట్విన్స్‌ బర్గ్‌’ అని నామకరణం చేసుకున్నారు. అలాగే కవలలనే పెళ్లి చేసుకుని, మళ్లీ కవలలకే జన్మనిచ్చారు. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇద్దరూ ఒకే రకమైన వ్యాధితో ఒకే రోజు మరణించారు. దీంతో వీరి గుర్తుగా ఏటా ఫిబ్రవరి 22వ తేదీ అంతర్జాతీయ కవలల దినోత్సవం జరుపుతున్నారు. ఈ రకంగా అంతర్జాతీయ కవలల దినోత్సవం ఏర్పడింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి