Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay Deverakonda – Rashmika Mandanna : ఇట్స్ అఫీషియల్.. మా పెళ్లి వేడుకకు ఇదే పేరు.. విజయ్, రష్మిక అధికారిక ప్రకటన..

22 February 2026

IND vs SA : సఫారీ చేతిలో చిత్తైన భారత్.. సూపర్-8 ఆరంభంలోనే షాక్!

22 February 2026

Kanipakam Antharalayam Photo,కాణిపాకం ఆలయంలో అపచారం.. తెలియక చేశానన్న మహిళ.. – dishonor in kanipakam devotees take photos in antharalayam

22 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kanipakam Antharalayam Photo,కాణిపాకం ఆలయంలో అపచారం.. తెలియక చేశానన్న మహిళ.. – dishonor in kanipakam devotees take photos in antharalayam
ఆంధ్రప్రదేశ్

Kanipakam Antharalayam Photo,కాణిపాకం ఆలయంలో అపచారం.. తెలియక చేశానన్న మహిళ.. – dishonor in kanipakam devotees take photos in antharalayam

.By .22 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kanipakam Antharalayam Photo,కాణిపాకం ఆలయంలో అపచారం.. తెలియక చేశానన్న మహిళ.. – dishonor in kanipakam devotees take photos in antharalayam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయంలో ఫోటోలు తీయడం నిషేధం. అయితే ఇటీవల విదేశీ భక్తుల బృందం ఆలయాన్ని సందర్శించింది. ఈ బృందంలోని ఓ వ్యక్తి అంతరాలయంలో హారతి ఇస్తున్న సమయంలో ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావటంతో తీసిన మహిళ క్షమాపణలు తెలిపారు. తెలియక చేశానని.. క్షమించాలని కోరారు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించినట్లు చెప్పారు.

Kanipakam
కాణిపాకంలో అపచారం(ఫోటోలు– Samayam Telugu)
కాణిపాకంలోని వరసిద్ది వినాయక ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. కాణిపాకం ఆలయంలోని అంతరాలయంలో ఫోటోలు తీయటం పూర్తిగా నిషిద్ధం. ఇది పూర్తిగా నిబంధనలు, ఆలయ సంప్రదాయాలకు విరుద్ధం. అయితే ఫిబ్రవరి 18వ తేదీన విదేశీ భక్తులు కాణిపాకం ఆలయాన్ని సందర్శించారు. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన 170 మందితో కూడిన విదేశీయుల బృందం కాణిపాకం వరసిద్ధి ఆలయాన్ని సందర్శించింది. జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తిమార్గ్‌కు చెందిన శ్రీపరమహంస విశ్వనాథ గురూజీ ఆధ్వర్యంలో వీరంతా ఆలయానికి వచ్చారు. అయితే ఈ బృందంలోని ఓ వ్యక్తి అంతరాలయంలో హారతి ఇస్తున్నప్పుడు ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఈ ఫోటోలను ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో భక్తులు, నెటిజనం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

దీంతో ఈ వ్యవహారం కాస్తా ఆలయ అధికారుల వద్దకు చేరింది. ఈ విషయం మీద కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ స్పందించారు. అంతరాలయంలో ఫోటో తీసిన వ్యక్తి ఎవరో గుర్తించి, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆలయంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అయితే భక్తులు, నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావటంతో.. తెలియకతీశాం, క్షమించండి అంటూ ఓ మహిళ శనివారం రోజు రాత్రి వీడియోను విడుదల చేశారు. విశ్వనాథ గురూజీ శిష్యురాలు అయిన రిషికా అభిరామి అనే మహిళ అంతరాలయంలో తెలియక ఫోటోలు తీశామని.. క్షమించాలని కోరారు. ఫోటోలు తీయకూడదని తమకు తెలియదని.. పొరపాటు జరిగిందన్నారు. సోషల్ మీడియా నుంచి కూడా ఆ ఫోటోలు, వీడియోలు తీసేశామని చెప్పుకొచ్చారు.

మరోవైపు గతంలోనూ కాణిపాకం ఆలయంలో ఓ అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాణిపాకం వినాయకుడికి విరిగిన పాలతో అభిషేకం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఘటన సంచలనం రేపగా.. అధికారులు స్పందించారు. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. అభిషేకం కోసం పాలను టెండరుదారు నుంచి భక్తులే ఆలయంలోకి తీసుకువస్తారని వివరించారు. అలివేల మండపంలో తీసుకుని.. అంతరాలయంలోకి తీసుకవస్తారని అన్నారు. అయితే టెండరుదారుడికి, భక్తుడికి మధ్య బయట గొడవ జరిగితే దానిని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి