కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. 22వ విడత కింద రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్లో వేయనుంది. హోలీకి ముందే వీటిని అందిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిధుల విడుదల ఆలస్యం కావడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి నెల చివరివారం లేదా మార్చి తొలివారంలో జమ చేసే అవకాశముంది.
అయితే పీఎం కిసాన్ పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలనే నిబంధనలపై అయోమయం నెలకొంది. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ రూల్ నిబంధనలపై గందరగోళం ఏర్పడింది. ఫార్మార్ రిజిస్ట్రీ ఐడీ పొందకపోతే పీఎం కిసాన్ ఆగిపోతుందా అనే అనుమానం నెలకొంది. అయితే 14 రాష్ట్రాల్లో మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్లకు ఫార్మర్ రిజిస్ట్రీ అవసరం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ ప్రారంభమైంది. దీంతో ఈ రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే పీఎం కిసాన్ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ అవసరం. మిగతా రాష్ట్రాల్లో అవసరం లేదు
అటు ఈకేవైసీ అనేది ప్రతీఒక్కరికి అవసరం. లబ్దిదారులను నిర్ధారించేందుకు ఈ ప్రక్రియ కేంద్రం తప్పనిసరి చేసింది. కామన్ సర్వీసెస్ సెంటర్‌కి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా కూడా రైతులు స్వయంగా చేసుకోవచ్చు.
ఇక 2019 ఫిబ్రవరి 1 తర్వాత ల్యాండ్ యాజమాన్య హక్కులు దక్కించుకున్నవారు ఈ పథకానికి అనర్హులు. పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి నో యువర్ స్టేటస్ క్లిక్ చేసి అర్హుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే పీఎం కిసాన్ నిధులు అందుతాయి.






