Visakhapatnam Government Victoria Hospital Normal Deliveries: సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలామంది ఆలోచిస్తారు. అయితే విశాఖపట్నంలోని విక్టోరియా ఆస్పత్రిలో మాత్రం నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో సాదారణ ప్రసవాలుఎక్కువ అవుతున్నాయి. గతేడాది ఏకంగా 3,214 మంది శిశువుల సాధారణ ప్రసవంలో జన్మించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఘోషాసుపత్రి సేవలకు ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం కూడా అందించారు. ఏపీ నుంచి మాత్రమే కాదు ఒడిశా నుంచి కూడా వైద్యం కోసం వస్తున్నారు.
హైలైట్:
- విశాఖపట్నంలో ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి
- ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు
- ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు

విశాఖపట్నంలోని విక్టోరియా ఆస్పత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీల కోసం అత్యాధునిక సామాగ్రిని ప్రభుత్వం, దాతలు కలిసి అందించారు. కొన్ని సందర్భాల్లో హైరిస్క్ కేసులు ఉంటాయి.. వీరు ప్రసవం అనంతరం ఇంటికి వెళ్లినా సరే.. మళ్లీ మామూలు స్థితికి వచ్చే వారకు స్థానికంగా ఉండ సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్యులు, ఆశా కార్యకర్తల ద్వారా పర్యవేక్షణ కూడా చేస్తారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సుమారు 220 వరకు ఓపీలు నమోదవుతున్నాయి.. వీటిలో సర్జరీలు, ప్రసవాలు కూడా ఉంటాయి. ఈ ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. గతేడాది సాధారణ ప్రసవాలు 3,214 ఉంటే.. సిజేరియన్‌లు 2123 ఉన్నాయట.
రూ.1.25 లక్షల విలువైన ఇంజెక్షన్లు పూర్తిగా ఉచితం.. ప్రాణాంతకమైన వ్యాధికి ట్రీట్మెంట్ ఫ్రీ
విక్టోరియా ఆస్పత్రిలో కొత్తగా మదర్, ఛైల్డ్ బ్లాక్ నిర్మాణం చేపట్టాలని.. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎనస్తీషియా, పిల్లల వైద్యులు ఒక్కొక్కరే ఉండటంతో.. వారిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. త్వరలోనే వీరిని నియమిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా ఆస్పత్రిలో నవజాత శిశువులకు స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు పసిపిల్లలకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే చాలామంది ఆలోచిస్తారు.. కానీ విశాఖపట్నంలో ఉన్న విక్టోరియా ఆస్పత్రికి ఎక్కువమంది గర్భిణిలు వెళుతున్నారట. ఈ ఆస్పత్రికి ఐఎస్‌వో సర్టిఫికేట్ కూడా రావడం మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.


