హైదరాబాద్, ఫిబ్రవరి 24: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ 2026)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) మరో కీలక ఆప్‌డేట్ జారీ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగిసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీతో సీయూఈటీ ఆన్‌లైన్ దరఖాస్తులు ముగిశాయి. అయితే ఎన్టీయే తాజాగా దరఖాస్తుల ప్రక్రియను మరోసారి తెరిచింది. విద్యార్థుల అభ్యర్థనల మేరకు రిజిస్ట్రేషన్‌కు మరోమారు అవకాశం కల్పించినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో 4 రోజుల పాటు పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ ఫీజుతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్టీయే అవకాశం ఇచ్చింది. అయితే అప్లికేషన్ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు సవరణకు అవకాశం ఉండదని, జాగ్రాత్తగా అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలని తెలిపింది. ఇక ప్రవేశ పరీక్షలు మే 11 నుంచి 31 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో జరగనున్నాయి.
ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 306 నగరాల్లో తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 37 సబ్జెక్టుల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
సీయూఈటీ యూజీ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
రూ.10 వేల ఆలస్య రుసుముతో తెలంగాణ పీజీఈసెట్ 2026కు దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్‌ను జేఎన్టీయూహెచ్ సోమవారం విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 27 నుంచి మొదలవుతాయి. మే 6వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పీజీఈసెట్ కన్వీనర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రాత పరీక్షలు మే 28 నుంచి 31 వరకు జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

