AP High Court Order Govt To Continue Professors In Vet Agri Universities: ఏపీ వ్యవసాయశాఖ పరిధిలోని నాలుగు యూనివర్శిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో రిలీఫ్ దక్కింది. యూజీసీ ప్కేల్ తీసుకుంటున్న వారి పదవీ విరమణ వయసుపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యూనివర్శిటీలలో ప్రొఫెసర్లకు పదవీ విరమణ వయసు పెంచకపోవడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వారిని సర్వీసులో కొనసాగించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైలైట్:
- ఏపీ వ్యవసాయశాఖ పరిధిలోని వర్శిటీల్లో ప్రొఫెసర్లకు ఊరట
- పదవీ విరమణ వయసుకు సంబంధించి కీలక ఆదేశాలు
- వారిని సర్వీసులో కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు (యూజీసీ స్కేల్ పొందుతున్నవారు) పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచింది. కానీ వ్యవసాయశాఖ పరిధిలో ఉన్న నాలుగు వర్సిటీల్లో ప్రొఫెసర్లకు మాత్రం పదవీవిరమణ వయస్సు పెంచలేదు. దీంతో వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. తమ పదవీవిరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సింగిల్ జడ్జి విచారణ జరిపి.. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అన్నారు. 2023 జులై 29న జారీ చేసిన జీవో 39ను ప్రస్తావిస్తూ.. వ్యవసాయశాఖ పరిధిలోని నాలుగు యూనివర్శిటీలలో ప్రొఫెసర్లకు కూడా పదవీ విరమణ వయసు 65కు పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గతేడాది నవంబర్‌లో ఆదేశించింది.
అయితే ఆ తర్వాత పిటిషన్లు ఏపీ హైకోర్టులో అప్పీళ్లు వేయగా.. ఇటీవల ధర్మాసనం విచారణ చేసింది. వ్యవసాయశాక స్పెషల్ సీఎస్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయన కూడా తాజగా విచారణకు హాజరుకాగా.. కాంపిటెంట్ అథారిటీ నిర్ణయం మేరకు పదవీ విరమణ వయసు పెంపుకు సంబంధించి నాలుగు యూనివర్శిటీల ప్రతిపాదనల్ని తిరస్కరించామన్నారు. అయితే హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ వాదనను తోసిపుచ్చి.. తిరస్కరించడానికి కారణాల గురించి ప్రశ్నించింది. గత ప్రభుత్వం పదవీవిరమణ వయసు పెంపును తిరస్కరించిందని.. ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం సమర్థించడంపై ప్రశ్నించింది. అధికారులు ఉన్నత పదవుల్లో ఉన్నవారి ఆలోచన గురించి తెలుసుకోకుండా.. నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది.


