కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అందుబాటులో తీసుకొచ్చింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వర్గాల వారీగా కేంద్రం పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్స్ ఉండగా.. ఇక సీనియర్ సిటిజన్లు, మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్నారుల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం అనేక పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో సుకన్య సమృద్ది యోజన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదే కాక ఎన్‌పీఎస్ వాత్సల్య అనే పథకాన్ని కూడా కేంద్రం అమలు చేస్తోంది.
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ఏంటి..?
నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) పథకం పొడిగింపులో భాగంగా ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌ను కేంద్రం కొనసాగిస్తోంది. కొన్ని వారాలు లేదా నెలలు వయస్సు ఉన్న చిన్నారుల కోసం తల్లిదండ్రులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ పిల్లలకు అకౌంట్‌ను తెరవడానికి ఇది అనుమతిస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లల కోసం సేవింగ్స్ చేస్తే పెద్దయ్యాక వారి ఉన్నత చదువుల కోసం ఇవి ఉపయోగడతాయి. పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
రోజుకు రూ.50 పెట్టుబడితో..
ఉదాహరణకు పిల్లల వయస్సు ఏడాది ఉన్నప్పటి నుంచి రోజుకు రూ.50 చొప్పున తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టురనుకుందాం. అంటే నెలకు రూ.1500 అవుతాయి. అదే వారికి 18 ఏళ్లు నిండాక, లేక కొంచెం పెద్దయ్యాక అవి రూ.10 లక్షలకు చేరుకుంటాయి. అదే 60 ఏళ్లు వచ్చేంతవరకు పెట్టుబడి కొనసాగిస్తే కార్పస్ రూ.17.369 కోట్లకు చేరుకుంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్ది పెట్టుబడి పెట్టే నగదును కూడా పెంచడం వల్ల అధిక ఆదాయం లభిస్తుంది.
అర్హతలు ఇవే
-సెప్టెంబర్ 14,2024లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది
-18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ల కోసం ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు
-తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షులు ఈ అకౌంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది
-కనీస పెట్టుబడి రూ.వెయ్యితో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది
-వార్షిక పెట్టుబడి రూ.వెయ్యి నుంచి స్టార్ట్ చేయవచ్చు
-గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు
-ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా రూ.1.5 లక్షలు పన్ను మినహాయింపు పొందవచ్చు
-పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ అమలు చూసుకుంటుంది
-ఇందులో పెట్టుబడి పెట్టే సొమ్ముకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది

