Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వికారాబాద్ ప్రమాదం: రంగాపూర్‌లో ఇన్నోవా బీభత్సం..ఒక కారు, బైకులు ధ్వంసం. .ఒకరు మృతి

24 February 2026

Gold Loan: గోల్డ్‌ లోన్‌.. ధరను ఎలా నిర్ణయిస్తారు? తాకట్టులో ఉన్న బంగారానికి బాధ్యత ఎవరిది?

24 February 2026

ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య – Telugu News | Hyderabad: Landmark Hotel Owners Family Dies by Suicide, Police Investigate Financial Troubles video

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur West News,టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడిలో పాల్గొన్న వ్యక్తికి తెలుగు యువత అధ్యక్ష పదవి.. నెట్టింట్ వైరల్! – guntur west telugu yuvatha president jannath appointment row between tdp supporters on social media
ఆంధ్రప్రదేశ్

Guntur West News,టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడిలో పాల్గొన్న వ్యక్తికి తెలుగు యువత అధ్యక్ష పదవి.. నెట్టింట్ వైరల్! – guntur west telugu yuvatha president jannath appointment row between tdp supporters on social media

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur West News,టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడిలో పాల్గొన్న వ్యక్తికి తెలుగు యువత అధ్యక్ష పదవి.. నెట్టింట్ వైరల్! – guntur west telugu yuvatha president jannath appointment row between tdp supporters on social media
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలుగు యువత అధ్యక్ష పదవి.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మధ్య ట్వీట్ల వార్‌కు కారణమవుతోంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా జన్నత్ హుస్సేన్ షేక్ అనే వ్యక్తిని నియమించారు. అయితే జన్నత్.. టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి ఘటనలో పాల్గొన్నాడని, వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని.. అలాంటి వ్యక్తికి తెలుగు యువత అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు.

Telugu yuvatha
గుంటూరు పశ్చిమ తెలుగు యువత అధ్యక్షుడు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేదీ ఎవ్వరూ ఊహించలేరు. రాజకీయంగా జరిగే ఏ చిన్న పరిణామమైనా సరే సోషల్ మీడియాలో పొలిటికల్ రచ్చకు కారణమవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ తెలుగు యువత అధ్యక్షపదవి పోస్టు.. ఇప్పుడు ఏపీ టీడీపీలోనే రెండు రకాల వాదనలకు కారణవుతోంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు, అభిమానులు రెండు వర్గాలుగా మారి ట్వీట్లు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. రాజకీయ పార్టీలు అన్నీ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే బూత్, మండల, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తూ చురుకుగా ఉండేవారికి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా పార్టీకి అనుబంధంగా మహిళ, యువత, రైతు అనుబంధ విభాగాలు కూడా ఉంటాయి.

అయితే ఈ విధంగానే తెలుగుదేశం పార్టీకి కూడా తెలుగు యువత పేరుతో అనుబంధ విభాగం ఉంది. తెలుగు యువతలో యువకులకు భాగస్వామ్యం ఉంటుంది. ఇక తెలుగు యువతకు కూడా మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా అధ్యక్షులను నియమిస్తుంటారు. ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు యువత అధ్యక్షుడి నియామకం ఆ పార్టీలో రెండు రకాల వాదనలకు కారణమవుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా జన్నత్ హుస్సేన్ షేక్ అనే వ్యక్తిని నియమించారు. అయితే ఈ నియామకానికి సంబంధించిన వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో జన్నత్ పాల్గొన్నాడంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అలాగే వైసీపీ నేతలతో అతనికి సంబంధాలు ఉన్నాయని.. వైసీపీ వ్యక్తిని తెలుగు యువత అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ మరికొందరు ట్వీట్లు పెడుతున్నారు. వైసీపీలో ఓ ముఖ్యనేతకు అనుచరుడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు అయ్యాడంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల మధ్యనే ట్వీట్లు నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ విషయం మీద గుంటూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వాసు పొదిలి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిలో జన్నత్ పాల్గొన్నారని వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత జరిగిన అన్ని నిరసన కార్యక్రమాలలో కూడా జన్నత్ పాల్గొన్నారని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత రౌడీషీట్ పెడతామని, కేసులు పెడతామని వైసీపీ నేతలు బెదిరిస్తే ఆ పార్టీలో చేరారని.. ఎన్నికలకు ముందుగానే టీడీపీలో చేరి.. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకోసం పనిచేశారని వివరణ ఇచ్చారు. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి దశ నుంచే తెలుగుదేశం పార్టీ తరుపున రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మొత్తంగా అలా ఓ తెలుగు యువత అధ్యక్ష పదవి తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయితీ పెట్టింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి