కావాల్సిన పదార్ధాలు : అర కిలో చికెన్, ఒక కప్పు తురిమిన బీట్‌రూట్, ఒక కప్పు ఉల్లిపాయలు ముక్కలు, రెండు టొమాటోలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.
కొద్దిగా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు , అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలపాలి.
చికెన్ ఉడికిన తర్వాత తురిమిన బీట్‌రూట్ వేసి 15 నిముషాల పాటు వాటిని నూనెలో బాగా మగ్గించాలి.
చికెన్, బీట్ రూట్ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి చికెన్ బాగా ఉడికే వరకు అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి. దించే ముందు చికెన్ మసాలా వేసి వడ్డించుకుని తినేయండి. వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది.






