తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో సొంత బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఓ ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. ఫిబ్రవరి 21న రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన ఆ ఐదుగురు వ్యక్తులు.. పనిమనుషులను చితకబాది.. సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు. సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్‌లు తీసుకుని ఆ దుండగులు పరారయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…
Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్
Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

