Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

T20 World Cup 2026 : శ్రీలంకకు పరాభవం.. 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎన్నడూ లేని చెత్త రికార్డు

26 February 2026

Ap Govt Qr Code For Every Building,ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు – andhra pradesh government to introduce qr codes for efficient public services related to waste management and civic services

26 February 2026

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Fake Website,కేరళకు చెందిన శ్రీవారి భక్తుడి ఫిర్యాదు.. తీగలాగితే కదిలిన డొంక.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ – ttd cautions tirumala srivari devotees about fake websites
ఆంధ్రప్రదేశ్

Ttd Fake Website,కేరళకు చెందిన శ్రీవారి భక్తుడి ఫిర్యాదు.. తీగలాగితే కదిలిన డొంక.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ – ttd cautions tirumala srivari devotees about fake websites

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Fake Website,కేరళకు చెందిన శ్రీవారి భక్తుడి ఫిర్యాదు.. తీగలాగితే కదిలిన డొంక.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ – ttd cautions tirumala srivari devotees about fake websites
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD on Fake Websites: దళారులు, నకిలీ వెబ్‌సైట్ల గురించి అప్రమత్తంగా ఉండాలని శ్రీవారి భక్తులకు టీటీడీ సూచించింది. కేరళకు చెందిన ఓ భక్తుడు మోసపోయిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టగా.. విచారణలో టీటీడీ పేరును ఉపయోగించుకుంటూ, తిరుమల శ్రీవారి ఆలయం ఫోటోలు వాడుకుంటూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి శ్రీవారి భక్తులను తప్పుదారి పట్టిస్తున్న వైనాన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.

Tirumala
నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తత(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) శ్రీవారి భక్తులను అప్రమత్తం చేసింది. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామని శ్రీవారి భక్తులను కొంతమంది మోసం చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. ఇలాంటి దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై అప్రమత్తమైన టీటీడీ .. భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. కేరళకు చెందిన సురేష్ బాబు అనే భక్తుడిని ఓ వ్యక్తి మోసం చేశారు. తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఓ వ్యక్తి సురేష్ బాబును మోసగించారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించి సమగ్ర విచారణ చేపట్టింది.

ఈ విచారణలో తిరుమల శ్రీవారి ఆలయం ఫోటోలు, టీటీడీ పేరును అనధికారికంగా వాడుకుంటూ కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు రూపొందించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ నకిలీ వెబ్ సైట్ల సాయంతో భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించింది. గూగుల్‌లో వెతికినప్పుడు కూడా ఈ ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది, ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా భక్తుల నుంచి ఆన్‌లైన్ విధానంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు టీటీడీ చిహ్నాలు, ఆలయం ఫోటోలను అనధికారికంగా ఉపయోగించే వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని.. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, సేవా టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inను సంప్రదించాలని సూచించింది. దళారులు, నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసానికి గురికావొద్దని విజ్ఞప్తి చేసింది.
అనుమానాస్పద వెబ్‌సైట్లు, ఫోన్ కాల్స్‌ గురించి సమాచారం ఉంటే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని టీటీడీ కోరింది.

అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత

మరోవైపు మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కావటంతో తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుచానూరులోని ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి