అడవిలోని జంతువులు, బలాన్ని మాత్రమే కాకుండా సహనాన్ని కూడా పరీక్షిస్తాయి. ఒక జంతువుకు బలం, ఓర్పు ఉంటే, అది అడవిలో ఎక్కువ కాలం జీవించగలదు. కానీ ఆ రెండూ లేకుంటే, మనుగడ కష్టమవుతుంది. తాజాగా, అడవికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో, ‘అడవి రాజు’ అయిన సింహంను దాదాపు 30 హైనాల గుంపుతో చుట్టుముట్టాయి. ఆ తర్వాత అది ప్రదర్శించిన బలం, ఓర్పు అడవి జంతువులకు ఒక గుణపాఠం..!
అడవిలోని బహిరంగ ప్రదేశంలో ఒంటరిగా కనిపించిన ఒక సింహం చుట్టూ హైనాల గుంపు చేరింది. సింహం చుట్టూ మూగిన హైనా బిగ్గరగా గర్జనలు చేస్తూ.. భయపెడుతూ.. వాతావరణంలో ఉద్రిక్తతను సృష్టించాయి. వాటి చర్యలు సింహాన్ని పెద్దగా ప్రభావితం చేయనప్పటికీ, హైనాలు దాని వెంటే పడుతున్నాయి. ఒక క్షణం, సింహం ఇబ్బందుల్లో ఉన్నట్లు అనిపించింది. కానీ కథ ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. హైనాల గుంపు సింహంపై దాడి చేయడంతో, సింహం తన నిజమైన రూపానికి తిరిగి రుచి చూపించింది తరువాత, ఒంటరిగా, హైనాలను ఎదుర్కొంది. ఒంటరిగా 30 హైనాలను భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ వన్యప్రాణుల వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @Axaxia88 అనే యూజర్ షేర్ చేశారు. “ఒక మృగరాజు తనను 30 హైనాల గుంపు చుట్టుముట్టినట్లు గుర్తించాడు. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? హైనాల అరుపులకు సింహా వెన్నుచూపుతుందా.;” అనే కాప్షన్ ఇచ్చారు. ఈ రెండు నిమిషాల, 15 సెకన్ల వీడియోను 26,000 సార్లు వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి రకరకాల ప్రతి స్పందనలు తెలియజేశారు.
వీడియోను ఇక్కడ చూడండిః
A Lion King finding himself surrounded by a group of 30 hyenas. Guess who won? 🦁🔥
The fact that he turns his back to a cackle of hyenas speaks volume on his confidence. pic.twitter.com/voQshTHumH
— Beauty of music and nature 🌺🌺 (@Axaxia88) February 25, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

