Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Adulterated Food: సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.? అంతా డేంజర్

26 February 2026

Bigg Boss Nikhil: సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్ ఇదిగో

26 February 2026

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త సేవలు.. ప్రారంభం ఎప్పుడంటే..?

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu On Polavaram Nallamala Sagar Link,పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు – andhra pradesh cm nara chandrababu naidu on polavaram nallamala sagar link project in ap assembly
ఆంధ్రప్రదేశ్

Chandrababu On Polavaram Nallamala Sagar Link,పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు – andhra pradesh cm nara chandrababu naidu on polavaram nallamala sagar link project in ap assembly

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu On Polavaram Nallamala Sagar Link,పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు – andhra pradesh cm nara chandrababu naidu on polavaram nallamala sagar link project in ap assembly
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉమ్మడి రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి.. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు లాభమేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో గోదావరి పుష్కరాల కంటే ముందే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. తానే చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.

Chandrababu
పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. గంగా- కావేరి నదుల అనుసంధానం పూర్తి చేయాలి అనేది తన చిరకాల కోరిక అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మన సంప్రదాయంలో ప్రకృతిని ఆరాధించడం, నీటిని పూజించడం ఉందని తెలిపారు. గోదావరి నదికి అఖండ హారతి ఇచ్చామని.. కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేసిన చంద్రబాబు.. నదులను పూజించే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు, పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు అన్నీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని.. తెలుగు రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు. పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చినట్లు గుర్తు చేసిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టుకు గతంలో తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు తానే పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించిన బ్రిటన్ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్‌ దొరను ఇప్పటికీ గుర్తుపెట్టుకుని.. గోదావరి జిల్లాల్లో ఆయన విగ్రహాలకు పూజిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

పోలవరం-నల్లమల సాగర్‌ లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు, ఏపీకి ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు.. గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే వరద నీటిని మాత్రమే తరలిస్తామని తెలిపారు. గోదావరి నదిపైన ఎగువన ఉన్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని.. అందుకు తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అడ్డు చెప్పకూడదని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు లాభమని పేర్కొన్నారు.

తన హయాంలోనే రెండోసారి గోదావరి నది పుష్కరాలు జరగబోతున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే కంప్లీట్ చేసి.. ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి పరిశీలించాలని అసెంబ్లీలో సూచించారు. మళ్లీ ఇలాంటి అద్భుత అవకాశం రాదని పేర్కొన్నారు. ఇప్పటికీ 66 ప్రాజెక్టులు నీటితో జలకళను సంతరించుకున్నాయని చంద్రబాబు తెలిపారు.

జూలై నెలలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు రానున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ. 2,500 కోట్ల పనులను పెండింగ్‌లో ఉండగానే గత ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం అని హడావుడి చేసినట్లు సెటైర్లు వేశారు. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీళ్లు తెచ్చినట్లు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు 14 వారాల డెడ్‌లైన్ పెట్టినట్లు తెలిపిన చంద్రబాబు.. ప్రతి వారం రిపోర్టులు పరిశీలిస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తానని తేల్చి చెప్పారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి