పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ, బంగారు దుకాణాల్లోనూ నిర్వాహకుల కళ్లు గప్పి దొంగతనాలకు పాల్పడే మహిళలను చూశాం… విలువైన పట్టు చీరలను చాకచక్యంగా చోరి చేయడంలో మహిళలది అందే వేసిన చెయ్యి. అయితే సిసి కెమెరాల పుణ్యమా అని చోరి జరిగిన తర్వాత మహిళలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే కొంతమేరకు చోరీలు తగ్గుముఖం పట్టాయి. అయితే గుంటూరు నగరంలోని రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ లో పదకొండు కేజీల జీడిపప్పు చోరి చేసిన ముగ్గురు మహిళలను గుర్తించి పోలీసులకు అప్పగించారు.
ఈ నెల 24 తేదిన మధ్యాహ్న సమయంలో ముగ్గురు మహిళలు లక్ష్మీపురంలోని రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ కు వచ్చారు. స్పైసెస్ జోన్ లోకి వెళ్లిన మహిళలు చాలా సమయం అక్కడే గడిపారు. ప్రొవిజన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నట్లు అక్కడక్కడే తచ్చాడారు. జీడిపప్పు ప్యాకెట్స్ ను చేతి బుట్టలో వేసుకుని పక్కకు వెళ్లడం వాటిని చీర కింద భాగంలో దాచుకొని తిరిగి మరోసారి వచ్చి మరికొన్ని ప్యాకెట్స్ తీసుకొని బుట్టలో వేసుకోవడం పక్కకు వెళ్లి వాటిని చీర కింద భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాల్లో దాచుకోవడం చేశారు. అలా అరగంట పాటు అక్కడే ఉండటంతో స్టోర్ నిర్వాహకులను అనుమానం వచ్చింది. మహిళలు బిల్లు చెల్లించి వెలుతున్న క్రమంలో అనుమానం వచ్చిన నిర్వాహకులు వారిని అడ్డగించి సోదాలు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
ఈసోదాల్లో మహిళ చీర కింద దాచుకున్న పదకొండు కేజీల జీడిపప్పు ప్యాకెట్స్ బయట పడ్డాయి. దీంతో వాళ్లని పోలీసులకు అప్పగించారు. స్టోర్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహిళలు వివరాలు సేకరించారు. చీరాలోని రాంనగర్ కు చెందిన ముగ్గురు మహిళలు పదకొండు కేజీల జీడిపప్పు చోరి చేసినట్లు గుర్తించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

