ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో పక్క భాషల హీరోయిన్లదే హవా నడిచేది.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మన టాలీవుడ్ బ్యూటీస్ అంతా వరుస ఆఫర్లతో కోలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు. అక్కడి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇలా టాలీవుడ్ టు కోలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన తెలుగమ్మాయిల జర్నీపై ఓ లుక్ వేద్దాం పదండి.. కోలీవుడ్‌లో ఎప్పుడో సెటిలైన తెలుగమ్మాయిల్లో అంజలి, ఐశ్వర్య రాజేష్, ‘బస్ స్టాప్’ ఫేమ్ ఆనంది పేర్లు ముందు వరుసలో ఉంటాయి. పుట్టిందిక్కడే అయినా.. తమిళంలోనే సినిమాలు చేసి స్టార్స్ అయ్యారు. ఈ ట్రెండ్‌నే ఈ జనరేషన్ బ్యూటీస్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా శ్రీలీల టైమ్ తమిళంలో మొదలైంది. ఈ మధ్యే ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు ఈ బ్యూటీ. మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరీప్రియ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. అలాగే ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన వైష్ణవి చైతన్యకు జీవి ప్రకాశ్ కుమార్‌తో నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో వలిమై సినిమాలో అజిత్ చెల్లిగా నటించారు వైష్ణవి. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. గతేడాది ‘కోర్ట్’ సినిమాతో మెప్పించిన శ్రీదేవి కూడా ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టేసారు. అక్కడ ఓ సినిమా చేసారీమే. అలాగే బబుల్ గమ్ సినిమాలో నటించిన మానస చౌదరి.. తమిళంలో ఆర్యన్, DNA సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి మన తెలుగమ్మాయిలంతా తమిళంలోనూ సత్తా చాటుతూ గట్టిగానే పాగా వేస్తున్నారు. వీళ్లంతా సక్సెస్ అయితే అంతకంటే ఇంకేం కావాలి..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనిల్ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం
అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..

