ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, ఫ్యామిలీ, కామెడీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఉంటాయి. అయితే ప్రజెంట్ ట్రెండ్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే ఎగబడి మరీ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా విషయానికి వస్తే.. కేరళలోని కొచ్చి నగరంలో వరుసగా హత్యలు జరుగుతాయి. ఈ మర్డర్ల మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ రంగంలోకి దిగుతాడు. అయితే కిల్లర్ మాత్రం చాలా తెలివిగా, చిన్న క్లూ కూడా దొరక్కుండా హత్యలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, ఈ హత్యల వెనుక ఒక భయంకరమైన పగ, ప్రతీకారం ఉందని, చనిపోయిన వారంతా గతంలో ఒక తప్పు చేసిన వాళ్లేనని ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ తెలుసుకుంటాడు. మరి ఆ హంతకుడు ఎవరు? అతనికి ఉన్న పగ ఏంటి? చివరకు జోసెఫ్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పేరు ధీరం. ఇదొక మలయాళం సినిమా. జితిన్ జోసెఫ్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్‌తో పాటు అజు వర్గీస్ ఏసీపీ పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే మంగళవారం నటి దివ్య పిళ్లై మరో కీలక పాత్రలో మెరిసింది. వీరితో పాటు విజయరాఘవన్, నిశాంత్ సాగర్, పానీ-ఫేమ్ సాగర్ సూర్య, రెబా మోనికా జాన్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మార్చి 06 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
#Dheeram (2025) | Malayalam
விரைவில் primevideo ஓடிடி தளத்தில் வெளியாகுகிறது…. pic.twitter.com/YDqsOApUdJ
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) February 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

