Ysrcp Councillor Brings Snake To Council Meeting,మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి పాము తెచ్చిన వైసీపీ కౌన్సిలర్.. ఎందుకు తెచ్చాడో తెలిసి! – ysrcp councilor bring snake to council meeting in nidadavolu
Nidadavolu Ysrcp Councilor Bring Snake To Council Meeting: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఓ కౌన్సిలర్ సమావేశానికి పామును తీసుకుని రావడం కలకలం రేపింది. నిడదవోలు 20వ వార్డులో తరచుగా పాములు వస్తున్నాయన్నారు. తన వార్డులో ఐదేళ్లుగా ఎలాంటి పనులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పాము స్కూల్ నుంచి బయటకు వచ్చిందని.. ఓ బాలుడు దాని పక్కగా వెళ్లాడని చెప్పుకొచ్చారు.
ఓ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ మున్సిపల్ సమావేశానికి పామును తీసుకొచ్చారు. దెబ్బకు అందరూ హడలిపోయారు.. ఇంతకీ పామును ఎందుకు తీసుకొచ్చారా అని ఆరా తీస్తే అప్పుడు కానీ అసలు సంగతి తెలియలేదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 20వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్ కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఆయన కౌన్సిల్ సమావేశానికి వస్తూ, వస్తూ తన వెంట ఓ తాచుపామును కూడా వెంట తీసుకురావడం కలకలం రేపింది. కౌన్సిలర్ అనిల్ కుమార్ ఓ సీసాలో ఆ పామును ఉంది సంచిలో పెట్టుకుని తీసుకొచ్చారుఅనిల్‌కుమార్ పాము ఉన్న సంచి తీసుకుని నేరుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించే హాల్‌లోకి తెచ్చారు. పాము ఉన్న ఆ సంచిని తన కుర్చీ పక్కన పెట్టుకున్నారు. ఈ పాము విషయం అక్కడే ఉన్న ఏఈ హేమంత్ దృష్టికి వచ్చింది. వెంటనే అధికారి అనిల్‌కుమార్ దగ్గరకు వెళ్లి పాము ఉన్న సంచిని బయటపెట్టి రావాలని అడిగారు. కౌన్సిలర్ అనిల్‌కుమార్ కుదరదు అని తేల్చి చెప్పారు. అనంతరం నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ కౌన్సిలర్ అనిల్‌కుమార్ సీరియస్‌గా చెప్పడంతో.. ఆయన ఆ పాము ఉన్న సంచిని తీసుకెళ్లి బయటపెట్టి, మళ్లీ హాల్‌లోకి వచ్చారు.
అప్పుడు ఏం జరిగిందని అనిల్‌కుమార్‌ను ఆరా తీస్తే.. అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా తన వార్డులో అసలు అభివృద్ధి పనులేవీ చేపట్టలేదని.. ఖాళీ స్థలాలు, మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు పెరిగిపోయాయన్నారు. ఆ మొక్కల్ని తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం స్కూల్ ఆవరణలోంచి తాచుపాము రోడ్డపైకి వచ్చిందన్నారు. ఓ బాలుడు చూసుకోకుండా ఆ పాము పక్కనుంచే వెళ్లాడన్నారు. ఆ పిల్లవాడిని పాము కాటేసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను వార్డులో పరిస్థితిని వివరించడం కోసం ఆ పామును పట్టించి, మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి తీసుకొచ్చానని చెప్పారు. మొత్తం మీద కౌన్సిలర్ అనిల్‌కుమార్ చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి