Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026

తల్లి ఒడిలో ఉండాల్సిన 3నెలల బాలుడు మాయం.. అటు ఇటు వెతుకుతుండగా ఊహించని షాక్..!

28 February 2026

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ias G Sai Prasad New Andhra Pradesh Cs,ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా జీ సాయిప్రసాద్.. ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే – ias g sai prasad to assume charge as new andhra pradesh chief secretary
ఆంధ్రప్రదేశ్

Ias G Sai Prasad New Andhra Pradesh Cs,ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా జీ సాయిప్రసాద్.. ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే – ias g sai prasad to assume charge as new andhra pradesh chief secretary

.By .28 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ias G Sai Prasad New Andhra Pradesh Cs,ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా జీ సాయిప్రసాద్.. ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే – ias g sai prasad to assume charge as new andhra pradesh chief secretary
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ias G Sai Prasad New Andhra Pradesh CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం నేటితో ముగుస్తోంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జి సాయిప్రసాద్ ఇవాళ అమరావతిలోని సచివాయంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైలైట్:

  • ఏపీ నూతన సీఎస్‌గా జీ సాయిప్రసాద్
  • నేడు బాధ్యతల్ని స్వీకరించనున్నారు
  • ప్రస్తుత సీఎస్ విజయానందర్ రిటైర్
Ias G Sai Prasad
ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా జీ సాయిప్రసాద్‌ నియమితులయ్యారు. ఆయన ఇవాళ ఉదయం 11.33 గంటలకు నూతన సీఎస్‌గా సచివాలయంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీకాలం నేటితో ముగియనుంది.. ఇవాళ ఆయన పదవీ ఉద్యోగ విరమణ చేయనున్నారు. అనంతరం నూతన సీఎస్‌గా సాయిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జి సాయి ప్రసాద్ 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారి. సాయిప్రసాద్‌ సొంత ఊరు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామం.. ఆయన ఎంటెక్ పూర్తి చేశారు. ఆయన 1991 ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1992 నుంచి 1993 వరకు వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా 1993 నుంచి 1995 వరకు పనిచేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 1995 నుంచి 1997 వరకు విధుల్లో ఉన్నారు. కడప జాయింట్ కలెక్టర్‌గా 1997 నుంచి 1998 వరకు ఉన్నారు. 2000 నుంచి 2003 వరకూ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా విధుల్లో ఉన్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా 2010 నుంచి 2011 వరకు విధులు నిర్వహించారు.

ఆయన ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ సీఎండీ, ఇంధనశాఖ ఎక్స్‌ అఫీషియో ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏగా 2019-24 మధ్య కాలంలో వ్యవహరించారు. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు 2025 జనవరి నుంచి ముఖ్యమంత్రి ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నా సరే.. ఆయనకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం తోలు, చెప్పుల తయారీ పాలసీ-4.0లో సవరణలు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలసీలో నామమాత్ర ధరకు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు లీజు విధానంలో భూ కేటాయింపులు జరిపేందుకు గతంలో ఉన్న నిబంధనలను సవరించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి