
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కౌన్సిల్ సమావేశంలో తాచుపాము కలకలం రేపింది. 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్ తాచు పామును డబ్బాలో పెట్టి సమావేశానికి తీసుకొచ్చారు. తన వార్డులో పాముల బెడద ఎక్కువగా ఉందంటూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పాముల బెడదను అధికారులకు తెలియజేసేందుకు.. పామును తీసుకొచ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చివరకు నిడవవోలు కౌన్సిల్ చైర్మన్ ఆదినారాయణ రిక్వెస్ట్ మేరకు పామును బయటపెట్టి కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్ హాజరయ్యారు. పాము బెడదను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

