Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price: వామ్మో.. బంగారం, వెండి అంటేనే భయమేస్తోంది.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన ధరలు

28 February 2026

చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే దిశగా కీలక అడుగు.. మూడు ప్రధాన నగరాల పేర్లు మార్పు..!

28 February 2026

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న రొమాంటిక్ మూవీ.. ఒక్కో సీన్ చూస్తే మెంటలే..

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati
ఆంధ్రప్రదేశ్

Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati

.By .28 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Amaravati R 1 Zone Settlement Policy: ఏపీ ప్రభుత్వ అమరావతిలో పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. అభివృద్ధితో పాటుగా భూసేకరణపై ఫోకస్ పెట్టింది. అయితే భూములు ఇచ్చిన రైతులకు పరిహారం, ప్లాట్ల కేటాయిస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్-1జోన్‌‌లో స్థలాలు, భవనాలు కోల్పోతున్నవారికి అందించే స్థలం, పరిహారానికి సంబంధించిన నెగోషియేటెడ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీలో కొన్ని మార్పులు చేసింది. స్థలానికి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

హైలైట్:

  • అమరావతి ఆర్-1 జోన్‌ పరిహారం అంశం
  • సెటిల్‌మెంట్‌ పాలసీలో కీలక మార్పులు
  • స్థలానికి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు
Amaravati R 1 Zone
ఆర్‌-1 జోన్‌లో పరిహారంగా స్థలానికి స్థలం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్-1జోన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్-1 జోన్‌లో భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి సీఆర్డీఏ తీపికబురు చెప్పింది. వీరందరి కోసం నెగోషియేటెడ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీలో భాగంగా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు, పరిహారం చెల్లిస్తారు. అయితే ఈ పాలసీలో ప్రభుత్వం కొన్ని అవసరమైన సవరణలు చేసింది. గతంలో ఆర్-1జోన్‌లో ఇళ్లు/భవనాలతో సహా స్థలాలు కోల్పోయిన వారికి.. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు పరిహారం ఇచ్చేవారు. అలాగే సీఆర్‌డీఏ స్థలానికి బదులు దాని విస్తీర్ణానికి దగ్గరగా ఉన్న (నియరెస్ట్‌ స్టాండర్డ్‌ ప్లాట్‌) స్థలాన్ని ఎల్‌పీఎస్‌ లేఔట్‌లో ఇచ్చేది. అయితే దీనివల్ల వారందరికి నష్టం జరుగుతోంది. తాజాగా సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్-1జోన్‌లో ఇళ్లు/ భవనాలు కోల్పోతున్న వారికి.. స్థలానికి సమానంగా విస్తీర్ణంలో స్థలం (ల్యాండ్‌ టు ల్యాండ్‌) కేటాయించేలా నిబంధనలు సవరించారు.. ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్-1జోన్‌లో కోల్పోయిన స్థలం చిన్నది అయితే.. ఒకవేళ ఎల్‌పీఎస్‌ లేఔట్లలో అంత చిన్న స్థలాలు ఇవ్వలేకపోతే మరో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక స్థలాన్ని కేటాయించేలా వెసులుబాటు కల్పించారు. ల్యాండ్‌ టు ల్యాండ్‌ (స్థలానికి సమానమైన స్థలం) విధానంలో వీరికి గరిష్ఠంగా 3 ప్లాట్ల వరకు పొందే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ వారు స్థలం వద్దని భావిస్తే టీడీఆర్‌ బాండ్‌లూ కూడా తీసుకోవచ్చు. ఆర్-1 జోన్‌లో కమర్షియల్, ఇండస్ట్రియల్ భవనాలు కోల్పోతున్నవారి కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు చెల్లిస్తారు. అంతేకాదు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో స్థలానికి సమానమైన స్థలాన్ని కూడా ఇస్తారు.

అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే వీటిలో చేపట్టనున్న అంతర్గత పనుల కోసం రూ.980.34 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతుల్ని వేర్వరుగా ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు భవనంలో పనులకు రూ.556 కోట్లు, అసెంబ్లీ భవనంలో పనులకు రూ.424.34 కోట్లు ఇచ్చారు. ఈ నిధులతో ఎలక్ట్రికల్, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్ట్‌లు తదితర అంతర్గత పనులు చేపడతారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి