Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ ఎలా దాడి చేశాయో తెలుసా..?

1 March 2026

Iran-Israel War: భారత్‌పై ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వీటి ధరలు..! సామాన్యులకు షాకే..

1 March 2026

Salman Ali Agha : కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు.. పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..
తాజా వార్తలు

Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..

దశాబ్దాల పాటు ఇరాన్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఒక శకం ముగిసింది. 1989లో ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ మరణానంతరం బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, 36 ఏళ్లకు పైగా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించారు. ఏప్రిల్ 19, 1939న ఇరాన్‌లోని పవిత్ర నగరం మషద్‌లో ఒక మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించారు. ఆయన తండ్రి జావద్ ఖమేనీ ప్రముఖ ఇస్లామిక్ పండితుడు. మషద్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఖమేనీ, అనంతరం కోమ్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అక్కడ ఆయన రుహోల్లా ఖొమేనీ బోధనలకు ప్రభావితమై, 1960ల నుండి పహ్లావీ రాజరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో పలుమార్లు జైలు జీవితం కూడా గడిపారు.

అధికారంలోకి..

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఖమేనీ కీలక పాత్రలు పోషించారు. రివల్యూషనరీ కౌన్సిల్ సభ్యుడిగా, డిప్యూటీ రక్షణ మంత్రిగా సేవలందించారు. 1981లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువు ఆయనే. రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీం లీడర్‌గా, ఆయన ఇరాన్ పాలనా వ్యవస్థను మత గురువుల నేతృత్వంలో మరింత పటిష్టం చేశారు. హార్డ్‌లైన్ మద్దతుదారులు ఆయనను దేవుడి తర్వాత అంతటి శక్తివంతుడిగా భావించేవారు.

సైన్యానికి అధికారులు

రివల్యూషనరీ గార్డ్స్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టి.. దేశ అంతర్గత, విదేశీ విధానాల్లో వారిని ప్రధాన శక్తిగా మార్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ వీరి నియంత్రణలోనే ఉంది. ఇరాన్‌ను సైనికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలకు నాయకుడిగా ఎదిగారు. పాలస్తీనాపై ఆయన వైఖరి సున్నీ ముస్లింలలోనూ ఆయనకు ప్రజాదరణ పెంచింది.

ప్రజా వ్యతిరేకత – నిరసనలు

ఖమేనీ పాలనలో ఇరాన్ శక్తివంతమైన దేశంగా ఎదిగినప్పటికీ, అంతర్గత నిరసనలు ఆయన పాలనకు పెద్ద సవాలుగా మారాయి. 2009లో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 2017, 2019లో ఆర్థిక ఆంక్షల వల్ల పెరిగిన ధరలపై నిరసనలు వెల్లువెత్తాయి. 2022లో యువతి మరణంతో చెలరేగిన హిజాబ్ వ్యతిరేక అల్లర్లను అణిచివేసే క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
నియంతృత్వ పాలన నుండి తమను రక్షించాలని చాలా మంది ఇరాన్ వాసులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరకు 86 ఏళ్ల వయసులో ఆయన మరణంతో ఇరాన్ రాజకీయాల్లో పెద్ద సంక్షోభం తలెత్తింది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ ఎలా దాడి చేశాయో తెలుసా..?

1 March 2026

Iran-Israel War: భారత్‌పై ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వీటి ధరలు..! సామాన్యులకు షాకే..

1 March 2026

Salman Ali Agha : కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు.. పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ ఎలా దాడి చేశాయో తెలుసా..?

1 March 2026

శనివారం ఉదయం.. టెహ్రాన్ నగర వాసులకు ఒక భయంకరమైన కలలా మిగిలింది. పాశ్చర్ జిల్లాపై దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలతో…

Iran-Israel War: భారత్‌పై ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వీటి ధరలు..! సామాన్యులకు షాకే..

1 March 2026

Salman Ali Agha : కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు.. పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు

1 March 2026

Cinema : 15 ఏళ్లుగా ట్రెండింగ్.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ ఎలా దాడి చేశాయో తెలుసా..?

1 March 2026

Iran-Israel War: భారత్‌పై ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వీటి ధరలు..! సామాన్యులకు షాకే..

1 March 2026

Salman Ali Agha : కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు.. పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.