
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణులతో విజృంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమర్చాయి. ఖమేనీ కూతురు, అల్లుడి కూడా ఈ దాడుల్లో మరణించినట్లు ఇరానీ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో పాటు 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం నుంచి మొదలైన యుద్దం నిర్విరామంగా కొనసాగుతోంది. ఖమేనీని హతమార్చుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా ప్రకటిస్తూ వస్తోన్నారు. చివరికి ఇజ్రాయెల్‌తో కలిసి తన శపథాన్ని ట్రంప్ నెరవేర్చుకున్నారు. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. బంగారం, వెండి ధరలు మండిపోతున్నాయి.
బంగారం ధరలు సరికొత్త రికార్డ్..?
ఖమేనీ మరణంతో యద్దం మరింత ముదిరే అవకాశముంది. గల్ప్ దేశాలైన దుబాయ్, ఖాతార్, అబుదాబిపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. గల్ప్ దేశాలపై కూడా యుద్ద ప్రభావం పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు సోమవారం రికార్డ్ దిశగా దూసుకెళ్లే అవకాశముందని మార్కెట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి 28న యుద్దం ప్రారంభమైన కొద్ది సేపటికే ముందుగా క్రిప్టో కరెన్సీలపై దీని ప్రభావం పడింది. బిట్ కాయిన్ 5 శాతం పడిపోయి 64 వేల డాలర్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. యుద్ద ప్రభావంతో సోమవారం నుంచి మార్కెట్లు అస్థిరంగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పసిడి ధరలు సరికొత్త రికార్డులు సృష్టించచొచ్చని చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం..?
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, అమెరికా కూడా యుద్దంతో పాల్గొనడంతో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ద ప్రభావం వల్ల ఇరాన్‌లో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లు దాటి వెళ్లవచ్చని అంటున్నారు. శనివారం బ్యారెల్‌కు బ్రెంట్ క్రూడ్ 70 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. ఈ వారంలో ధరలు మరింత పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ముడి చమురును 80 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.50, డీజిల్ రూ.95.70గా కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో పెట్రోల్ రూ. 100.93, డీజిల్ రూ. 92.48గా ఉంది. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పసిడి, ముడి చమురు ధరలపై ఎక్కువగా పడే అవకశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
