Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

1 March 2026

B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

1 March 2026

RRB Admit Cards 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే అడ్మిట్‌ కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»March New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు చేసిన కేంద్రం.. నేటి నుంచి ఇవి తప్పనిసరి..
తాజా వార్తలు

March New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు చేసిన కేంద్రం.. నేటి నుంచి ఇవి తప్పనిసరి..

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
March New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు చేసిన కేంద్రం.. నేటి నుంచి ఇవి తప్పనిసరి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మార్చి 1 వచ్చేయడంతో ప్రజలను ప్రభావితం చేసే చాలా మార్పులు అమల్లోకి వచ్చాయి. మీ నెలవారీ పొదుపు, ఖర్చులు, బడ్జెట్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి యూపీఐ చెల్లింపులు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వరకు అనేక సవరణల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చిలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ మార్పుల గురించి దేశంలోని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధరలు

ప్రతీ నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో చమురు మార్కెటింట్ కంపెనీలు మార్పులు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇవాళ వాణిజ్య సిలిండర్ ధరలను రూ.30 మేర పెంచగా.. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లలో ఎలాంటి మార్పులు జరగలేదు.

పెరిగిన ఏటీఎఫ్ ధరలు

ఇక విమాన ఛార్జీలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే జెట్ ఇంధనం ధరలు పెరిగాయి. మార్చి 1 నుంచి ప్రధాన మోట్రో నగరాల్లో ఎయిర్ టర్బైన్ ఇంధనం ధరను రూ.4,977.24 నుంచి రూ.5,498.50కి పెంచారు. ఈ ఇంధనం ధరలు పెరిగినప్పుడు వీటి భారాన్ని ప్రయాణికులకు బదిలీ చేస్తాయి విమానయాన సంస్థలు

సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు

ఇక సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగే అవకాశముండటంతో వాటి ధరలను సవరించవచ్చు. గల నెలలో అదానీ టోటల్ గ్యాస్ వీటి ధరలను కిలోకు రూ.4.05 నుంచి రూ.4 తగ్గించింది. ఇక టోరెంట్ గ్యాస్ సీఎన్‌జీ ధరను కిలోకు రూ.3.50, పీఎన్‌జీ ధరను రూ.2 తగ్గించింది.

యూపీఐ చెల్లింపు వ్యవస్థలో ఛేంజ్

మార్చి 1 నుంచి అధిక విలువ గల లావాదేవీలకు యూపీఐ పిన్‌కు బదులు అదనపు భద్రత కోసం బయోమెట్రిక్స్ లేదా మల్టీ ఫాక్టర్ ప్రామాణీకరణను ఉపయోగించడం బ్యాంకులు తప్పనిసరి చేశాయి. దీంతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో మార్పులు జరగనున్నాయి.

సిమ్ బైండింగ్

మార్చి 1 నుంచి కొత్త సిమ్ బైండింగ్ నియమాలు అమల్లోకి వచ్చేశాయి. ఇక నుంచి వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, అరట్టై, షేర్ చాట్, జోష్, జియో చాట్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడాలంటే ఫోన్‌లో సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంతకముందు కేవలం రిజిస్టర్ అయ్యే సమయంలో మాత్రమే సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత సిమ్ తీసివేసినా యాప్స్ పనిచేసేవి. సైబర్ నేరాలను నిరోధించేందుకు సిమ్ బైండింగ్ నిబంధనను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక వెబ్ వెర్షన్లలో కూడా 6 గంటలకు ఒకసారి యాప్స్ ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

1 March 2026

RRB Admit Cards 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే అడ్మిట్‌ కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

1 March 2026

Alyssa Healy : చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు.. ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

1 March 2026

ఖర్జూరం.. ఇది కేవలం డ్రై ఫ్రూట్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సూపర్ ఫుడ్..ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా…

B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

1 March 2026

RRB Admit Cards 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే అడ్మిట్‌ కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

1 March 2026

Garikapati Andhra Pradesh Name Change Demand,‘ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలి.. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు’: గరికపాటి – garikapati narasimha rao demands to rename andhra pradesh as telugu nadu

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

1 March 2026

B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

1 March 2026

RRB Admit Cards 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే అడ్మిట్‌ కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.