తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రానున్న కొద్ది నెలల్లో మరో కొత్త ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. కొత్త ఎయిర్‌పోర్ట్ డీపీఆర్‌కు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించనుండగా.. అనంతరం త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక్కటే అందుబాటులో ఉంది. దీంతో ప్రజలకు మరింతగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు వరంగల్‌లోని మామునూరులో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ముందడుగు వేసింది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన పని ఉండదు. వరంగల్ నుంచే రాకపోకలు కొసాగించవచ్చు.
ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కి డీపీఆర్ సిద్దమవ్వగా.. కేంద్రం నుంచి డీపీఆర్‌కు అనుమతి రావాల్సి ఉంది. కేంద్రం త్వరలోనే ఆమోదించనుండగా.. ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు.
ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. 950 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఇదే కాకుండా అదనంగా మరో 253 ఎకరాలు కూడా సేవరించింది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్, కార్గో సౌకర్యంతో పాటు పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఉండనున్నాయి.
ప్రస్తుతం చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా మామునూరు ఎయిర్‌పోర్ట్ ఉంది. దీన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చనున్నారు. దీని వల్ల ఎయిర్ కనెక్టివిటీ కోసం జిల్లాల ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేశంలోనే వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచే చేరుకోవచ్చు. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కనెక్టివిటీ లభించనుంది.






