Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

1 March 2026

ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

1 March 2026

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..! ఎందుకంటే..?
తాజా వార్తలు

ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..! ఎందుకంటే..?

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..! ఎందుకంటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మన ఇంటి చుట్టూ సాధారణంగా పెరిగే కుప్పింటాకు మొక్క, దీనిని ప్రాంతాన్ని బట్టి హరిత మంజరి లేదా మురిపిండి అని కూడా పిలుస్తారు. అపారమైన ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుత వనమూలిక. యూఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా. ఆంగ్లంలో దీనిని ఇండియన్ అకాలిఫా, ఇండియన్ మెర్క్యురి, ఇండియన్ కాఫర్ లీఫ్ లేదా ఇండియన్ నేటిల్ అని కూడా వ్యవహరిస్తారు. దీని ప్రత్యేకత కప్పాకారంలో ఉండే పుష్పగుచ్చం. ఈ మొక్కను పూర్వం నుంచి భారతీయ సంప్రదాయ వైద్యంలో, తమిళుల సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, పశ్చిమ తూర్పు ఆఫ్రికాలో కూడా ఇది ఒక గొప్ప ఔషధిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆధునిక కాలంలో కూడా వైద్యులు దీనిని వాడమని సిఫార్సు చేయడం కుప్పింటాకు గొప్పతనాన్ని చాటుతుంది.

ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:

కండరాల నొప్పులు: కుప్పింటాకు తాజా ఆకులను శుభ్రం చేసి రసం తీయాలి. ఈ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి నీరు ఆవిరి అయ్యే వరకు సన్నటి మంటపై మరిగించి నిల్వ చేసుకోవాలి. కండరాల నొప్పి ఉన్నప్పుడు ఈ నూనెను గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే ఉపశమనం లభిస్తుంది.

తలనొప్పి: అధిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల వచ్చే తలనొప్పికి, ఈ మొక్క రసాన్ని నుదిటికి రాసి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది.

చర్మ సౌందర్యం: పూర్వం నుంచి చర్మ సౌందర్యానికి ఈ మొక్కను ఉపయోగించేవారు. ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. ఇది మొటిమలు, నల్లటి మచ్చలను తగ్గించి, అవాంఛిత రోమాలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.

జీర్ణ, శ్వాసకోశ సమస్యలు: విరోచనం సాఫీగా అవ్వడానికి, శ్వాసకోశ సమస్యలు, కఫం తగ్గించడానికి దీని తాజా ఆకులను రాత్రి గ్లాసు నీటిలో వేసి ఉదయం వడకట్టుకుని రెండు స్పూన్ల మోతాదుగా తాగాలి. అధికంగా తీసుకోకూడదు, వాంతులు అయ్యే అవకాశం ఉంది.

దంత ఆరోగ్యానికి: కుప్పింటాకు వేరుతో దంతాలు తోమితే తెల్లగా, దృఢంగా మారతాయి. ఇది చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని ఆపి, చిగుళ్లను గట్టిపరుస్తుంది. ఈ ప్రక్రియ సమస్త దంత సమస్యలను నివారిస్తుంది. ఆకుల రసంలో ఉప్పు కలిపి తోమినా ఇదే ప్రయోజనం.

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు: కుప్పింటాకు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆకు పసరులో నిమ్మరసం కలిపి గజ్జి, తామర, దురదలపై రాస్తే తగ్గుతాయి.

విష కీటకాల కాటు: పాముకాటు, తేలుకాటు, కాళ్ళజెర్రి కాటు లేదా కందిరేగ కరిచిన చోట కుప్పింటాకులను ముద్దగా నూరి కాటు ప్రదేశంలో కడితే విషం విరిగిపోతుంది.

మొలల సమస్య: ఈ ఆకులను సేకరించి ఎండించి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా తులసి ఆకుల పొడి కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు వేళ్లతో తీసుకుంటే ఎంత వస్తుందో, అంత మోతాదులో రెండుసార్లు నెయ్యి కలిపి తీసుకుంటే మొలల సమస్య తగ్గుతుంది.

పొట్ట ఇన్ఫెక్షన్లు, నులిపురుగులు: పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉంటే, ఆకులను మరియు చిన్న ఉల్లిపాయ రెబ్బలను కలిపి పేస్ట్ చేసి, అన్నంతో కలిపి తింటే తగ్గుతాయి. ఆకులతో కూర వండుకొని మితంగా తింటే కడుపులోని నులిపురుగులు పోతాయి.

పిప్పి పన్ను:  పిప్పి పన్నుతో బాధపడేవారు వీటి ఆకులను నలిపి పిప్పిపన్ను ప్రదేశంలో పెడితే క్రిమి నశించి బాధ తగ్గుతుంది.

గోరుచుట్టు: కుప్పింటాకులకు పసుపు కలిపి ముద్దగా నూరి గోరుచుట్టుపై వేసి కట్టుకడితే నయమవుతుంది.

చుండ్రు: ఈ ఆకుల రసంలో వేపాకుల రసం సమంగా కలిపి తలపై అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

జలుబు, దగ్గు: గుప్పెడు కుప్పింటాకులను శుభ్రం చేసి గ్లాసు నీటిలో వేసి సగం అయ్యేవరకు మరిగించాలి. చల్లారాక ఈ నీటిని పావు కప్పు మోతాదుగా తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

నల్ల మచ్చలు, కీళ్లనొప్పులు: మోచేతి నలుపులు, కంటికింద నల్లటి వలయాలు, చంకలలో నలుపులు ఉన్నచోట ఈ మొక్క ఆకుల రసంలో నిమ్మరసం కలిపి రాస్తే నలుపులు పోతాయి. ఆకుల రసంలో ఉప్పు కలిపి కీళ్లనొప్పి ప్రదేశంలో రాస్తుంటే నొప్పి తగ్గుతుంది.

గాయాలు, చర్మపు మంట: గాయాలు, పుండ్లపై ఈ ఆకుల రసాన్ని పిండితే త్వరగా తగ్గుతాయి. చర్మం మంటగా ఉన్నప్పుడు, వేడి కురుపులు, పురుగులు కుట్టిన ప్రదేశంలో తాజా ఆకుల పేస్ట్‌ను అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది.

ముఖ్య గమనిక: ఈ మొక్కను ఔషధంలా మోతాదుగా మాత్రమే వాడాలి. అధికంగా తీసుకోకూడదు. పిల్లల కోసం ఎదురుచూసేవారు, గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రయోజనాలకు దూరంగా ఉండాలి. మీకు తెలియకపోతే నిపుణుల సలహా ప్రకారం వారి సమక్షంలో చేయడం మంచిది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

1 March 2026

ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

1 March 2026

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

1 March 2026

కావాల్సిన పదార్ధాలు : పావుకిలో అడవి దొండకాయలు , 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అర టీ…

ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

1 March 2026

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

1 March 2026

‘అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు రద్దు..?’ క్లారిటీ ఇచ్చిన బోర్డు

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

1 March 2026

ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

1 March 2026

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.