Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Loan: ఇరాన్‌-ఇజ్రాయిల్‌ వార్‌.. గోల్డ్‌ లోన్‌ తీసుకున్న వారికి బిగ్‌ అలర్ట్‌!

1 March 2026

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

1 March 2026

ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kuchipudi Silicon Andhra Sanjivani Hospital,Silicon andhra sanjivani Hospital: ఆ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం.. మెడికల్ టెస్టులు, సర్జరీలూ ఫ్రీనే.. – free medical tests and treatment for patients in kuchipudi silicon andhra sanjivani hospital
ఆంధ్రప్రదేశ్

Kuchipudi Silicon Andhra Sanjivani Hospital,Silicon andhra sanjivani Hospital: ఆ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం.. మెడికల్ టెస్టులు, సర్జరీలూ ఫ్రీనే.. – free medical tests and treatment for patients in kuchipudi silicon andhra sanjivani hospital

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kuchipudi Silicon Andhra Sanjivani Hospital,Silicon andhra sanjivani Hospital: ఆ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం.. మెడికల్ టెస్టులు, సర్జరీలూ ఫ్రీనే.. – free medical tests and treatment for patients in kuchipudi silicon andhra sanjivani hospital
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైద్యం వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజులలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఫ్రీగా అందించే ఆస్పత్రి ఉందంటే నమ్ముతారా. అదే కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉన్న సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి. ఉచిత వైద్యంతో పాటుగా అత్యాధునిక వైద్య పరీక్షలు, సర్జరీలను కూడా ఉచితంగా అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరు తెచ్చుకుంది. 2018లో ఏర్పాటైన సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి.. 200 పడకల సామర్థ్యంతో 70 గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తోంది.

Kuchipudi Silicon andhra sanjivani Hospital,
కూచిపూడి సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి(ఫోటోలు– Samayam Telugu)
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరుతెచ్చుకుంది కృష్ణా జిల్లా కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి. 2015 సంవత్సరంలో సిలికానాంధ్ర జగమంత కుటుంబం అనే సంస్థ కూచిపూడి అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సమయంలోనే ఈ ప్రాంత ప్రజల కోసం అధునాతన సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, కూచిభొట్ల ఆనంద్‌తో పాటుగా మరికొందరు దాతలు.. ఆస్పత్రి నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభించారు.

ఈ ఆస్పత్రిలో పీడియాట్రిక్, గైనకాలజీ విభాగాలతో పాటుగా కిడ్నీ, ఎముకలు, దంతాలు, గుండె, ఊపిరితిత్తులు, మధుమేహం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, నరాలు, రేడియాలజీ, చర్మవ్యాధులు, ఫిజియోథెరపీ, డయాలసిస్ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు తప్ప మిగిలిన వారికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, మందులతో పాటుగా ఎక్స్‌రే, స్కానింగ్‌పై 50 శాతం వరకూ రాయితీ ఇస్తున్నారు. అలాగే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలను నామమాత్రపు ఖర్చుతో చేస్తున్నారు.

పేదలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కూచిపూడి గ్రామంలో 200 పడకల సౌకర్యంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కూచిపూడితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 70 గ్రామాల ప్రజలకు ఈ ఆస్పత్రి ద్వారా సేవలు అందుతున్నాయి. ఈ ఆస్పత్రిలో నిత్యం సుమారు 450 మంది చికిత్స తీసుకుంటున్నారు. 2025 సంవత్సరంలో సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి ద్వారా.. 40,785 మందికి వైద్యం అందించారు. వీరిలో 3,077 మంది అవుట్‌ పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 486 మందికి రాయితీపై కాన్పులు చేశారు. ఉచితంగా 202 మందికి కాన్పులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 311 మందికి డయాలిసిస్‌ చేసినట్లు తెలిపాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి