సీజన్ అంటే సంక్రాంతి ఒక్కటేనా..? మిగిలిన ఏడాదంతా ఆడియన్స్‌ను రావద్దని ముందుగానే దర్శక నిర్మాతలే చెప్పేస్తున్నారా..? సంక్రాంతికి వస్తే టైటిల్ కూడా అదే పెట్టాలా..? ఒకట్రెండు సార్లు వర్కవుట్ అయితే టైటిల్ కచ్చితంగా పండగతోనే ముడిపడాలా..? ఓటిటి సగం ఆడియన్స్‌ను తగ్గిస్తే.. మిగిలిన సగం దర్శక నిర్మాతలే చెడగొడుతున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. 10 నెలల ముందే 2027 సంక్రాంతి బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటూ మన దర్శక నిర్మాతలు, హీరోలు వేరే సీజన్లను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కంటెంట్ కంటే పండగ సెంటిమెంట్‌నే నమ్ముకుంటూ.. సంక్రాంతి టైటిల్స్ పెట్టి ఒకేసారి బాక్సాఫీస్ మీద పడటానికి రెడీ అవుతున్నారు. అసలు ఏడాదిలో 365 రోజులు కష్టపడేది ఆ ఒక్క పండగ కోసమేనా, వేరే సీజన్ పనికిరాదా అనే డౌట్ రాక మానదిక్కడ. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలు లాక్ చేయగా.. చిరు, బాలయ్య కూడా రేసులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సీనియర్లు పండక్కి కర్చీఫ్ వేయడంతో.. వాళ్ళకు పోటీగా జూనియర్లు కూడా రెడీ అయ్యారు. శర్వానంద్, నితిన్, తేజ సజ్జా లాంటి హీరోలు కూడా పండక్కే వస్తామంటున్నారు. పైగా టైటిల్స్‌లో పండగనే పెట్టుకుని వస్తున్నారు. శ్రీనువైట్లతో శర్వానంద్ హ్యాపీ పొంగల్ అంటుంటే.. ఆయ్ దర్శకుడు అంజితో నితిన్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటున్నారు. ఇక నిర్మాత రాజేష్ దండా అదిరిపోద్ది సంక్రాంతి టైటిల్ రిజిష్టర్ చేస్తే.. మరో నిర్మాత పండగ బొమ్మ అనే టైటిల్ లాక్ చేసారు. అనిల్ రావిపూడి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, అదిరిపోద్ది సంక్రాంతి లాంటి పదాలను బాగా హైలైట్ చేసేసారు. డిసెంబర్‌లో వస్తానంటున్న విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన కూడా ఫైనల్‌గా సంక్రాంతి బరిలోనే దిగేలా ఉంది. మొత్తానికి ఏ హీరోను తీసుకున్నా కూడా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు.. అది కూడా సంక్రాంతి అని టైటిల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆడియన్స్ కేవలం సంక్రాంతికి మాత్రమే థియేటర్స్‌కు వచ్చి.. మిగిలిన రోజులు ఓటిటికే పరిమితం అయిపోతారేమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్
AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!
Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్

