సిగరెట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతాయి. అయినప్పటికీ ధూమపానం చాలా మందికి ఇష్టమైన అలవాటు. ముఖ్యంగా కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు సిగరెట్లు వరుస పెట్టా తాగుతుంటారు. అయితే నిజంగా సిగరెట్లు తాగడం వల్ల మైండ్ రిల్సాక్ అవుతుందా? ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకుంటే చాలా మంది చెప్పే విషయం.. ఒత్తిడికి గురైనప్పుడు సిగరెట్ కాల్చితే రిలాక్స్‌గా ఉంటుంది అని. చాలా మంది ఇలా చెప్పడం మీరు విని ఉంటారు. కాబట్టి సిగరెట్లు నిజంగా ఒత్తిడి తగ్గిస్తుందా? ఇది మనశ్శాంతిని ఇస్తుందా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
ధూమపానం నిజంగా ఒత్తిడిని తగ్గిస్తుందా?
పొగాకులో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది తేలికపాటి ఉద్దీపన లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల పాటు ఉపశమన అనుభూతిని కలిగిస్తుంది. ఈ నికోటిన్ శరీరం డోపమైన్ వంటి హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచే హార్మోన్. ఈ హార్మోన్ శరీరంలో విడుదలైనప్పుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది సిగరెట్ తాగిన తర్వాత వారికి ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.
నికోటిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కానీ అది కొన్ని సెకన్ల నుంచి నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ధూమపానం మానసిక ఒత్తిడిని తగ్గించదు. పైగా కాలక్రమేణా శరీరం నికోటిన్‌ను కోల్పోతున్నప్పుడు, అది విశ్రాంతి లేకపోవడం, చిరాకును పెంచడం వంటివి కలిగిస్తుంది. నికోటిన్ స్థాయిలు తగ్గినప్పుడు మళ్ళీ ధూమపానం చేయాలనే కోరికను కలిగిస్తుంది. ఈ చక్రం శరీరం, మనస్సుపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇది ఆందోళన, చిరాకు, నిద్రలేమిని కూడా పెంచుతుంది. ఎక్కువసేపు ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస ఆడకపోవడం, దగ్గు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంమీద ధూమపానం ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుందన్నమాట. కానీ దీర్ఘకాలంలో ఇది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం మంచి ఎంపిక.
ఇవి కూడా చదవండి
ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గాలు ఇవిగో..
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ధూమపానానికి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే..
- వ్యాయామం – యోగా: ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది.
- ధ్యానం – మైండ్‌ఫుల్‌నెస్: ఇది మానసిక శాంతి, ప్రశాంతతను అందిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.
- ఆరోగ్యకరమైన ఆహారం: చక్కెర – కెఫిన్ తీసుకోవడం నియంత్రించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి సమతుల్యంగా ఉంటుంది.
- సామాజిక మద్దతు: ఒంటరిగా కూర్చుని సిగరెట్లు కాల్చే బదులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
- అభిరుచులు – సృజనాత్మక కార్యకలాపాలు: డ్రాయింగ్, పెయింటింగ్, తోటపని మొదలైన కార్యకలాపాలలో పాల్గొనాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీలో సానుకూలతను పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

