TDP MLA Kolikapudi Srinivas Vs MP Kesineni Chinni In Temple: విజయవాడ ఎంపీ కేశినేేని వర్సెస్ తిరుమూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం రేగింది.గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. కేశినేని చిన్ని పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సిద్ధం కాగా.. కొలికపూడి తనకు ఇవ్వాలని అడిగారు. కేశినేని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేకు ఇచ్చేయగా.. ఆ తర్వాత ఇరువర్గాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.
హైలైట్:
- ఎంపీ కేశినేని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి
- దేవుడి సాక్షిగా మరోసారి భగ్గుమన్న విభేదాలు
- పట్టు వస్త్రాల సమర్పించే విషయంలో వార్

ఎమ్మెల్యే కొలికపూడి పట్టువస్త్రాలను తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు ముందుకు కదిలారు. అదే సమయంలో ఎంపీ శివనాథ్ వర్గీయుడైన రామకృష్ణ వెంటనే కొలికపూడి దగ్గర ఉన్న పట్టువస్త్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే ఎంపీ శివనాథ్ రంగంలోకి దిగి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు.. వివాదాలు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ తర్వాత ఎంపీ వెళ్లి భక్తుల మధ్యలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఎంపీ శివనాథ్ భక్తుల మధ్యలో కూర్చుని తిలకిస్తుండగా.. ఎమ్మెల్యే కొలకపూడి వేదిక దగ్గర కూర్చున్నారు. ఇంతలో ఎమ్మెల్యేను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేదిక దగ్గర పైకి లేచారు.. ఆయన కూడా ఎంపీవైపు తిరిగి పరుషంగా మాట్లాడారు. వెంటనే గమనించిన టీడీపీ నేతలు ఎమ్మెల్యేను వారించారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం ముగియగా.. ఎంపీ శివనాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోసారి దేవుడి సాక్షిగా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. టీడీపీ అధిష్టానం ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడింది.. ఇద్దరు నేతలు వివరణలు ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడిని వరుసగా వివాదాలు వెంటాడటంతో అధిష్టానం సీరియస్‌గా స్పందించి హెచ్చరించింది.


