Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026

మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?

5 March 2026

అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»T20 World Cup 2026 : ఒకే రోజు రెండు సెమీఫైనల్స్? ఐసీసీ రిజర్వ్ డే ప్లాన్ అదిరిపోయిందిగా
తాజా వార్తలు

T20 World Cup 2026 : ఒకే రోజు రెండు సెమీఫైనల్స్? ఐసీసీ రిజర్వ్ డే ప్లాన్ అదిరిపోయిందిగా

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
T20 World Cup 2026 : ఒకే రోజు రెండు సెమీఫైనల్స్? ఐసీసీ రిజర్వ్ డే ప్లాన్ అదిరిపోయిందిగా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నౌకౌట్ దశకు చేరుకుంది. లీగ్ దశ, సూపర్-8 గండాలను దాటుకుని నాలుగు జట్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక ఇక్కడి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ఒక యుద్ధమే. ఓడితే ఇంటికి.. గెలిస్తే ఫైనల్‌కు.. మార్చి 4 నుంచి ఈ సెమీస్ పోరు మొదలుకానుంది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనున్నాయి. ఇక రెండో సెమీఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢీకొనబోతోంది. ఈ కీలక మ్యాచుల కోసం ఐసీసీ కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది.

వర్షం వల్ల మ్యాచ్‌లు ఆగిపోతే అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు ఐసీసీ ఈసారి రిజర్వ్ డే సౌకర్యాన్ని కల్పించింది. ఒకవేళ మార్చి 4న జరగాల్సిన మొదటి సెమీఫైనల్ వర్షం కారణంగా పూర్తవ్వకపోతే, ఆ మ్యాచ్‌ను మరుసటి రోజు అంటే మార్చి 5కి మారుస్తారు. అలాగే మార్చి 5న జరగాల్సిన రెండో సెమీఫైనల్‌కు కూడా ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మొదటి సెమీఫైనల్ వర్షం వల్ల వాయిదా పడితే, మార్చి 5వ తేదీన ఒకే రోజు రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

షెడ్యూల్ ప్రకారం మార్చి 5న భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాలి. ఒకవేళ మొదటి సెమీఫైనల్ రిజర్వ్ డేకి మారితే, దానిని మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభిస్తారు. తద్వారా క్రికెట్ ప్రేమికులు ఒకే రోజు రెండు హై-వోల్టేజ్ మ్యాచులను చూసే ఛాన్స్ దక్కుతుంది. మ్యాచ్ ఫలితం తేలడానికి ఐసీసీ అదనపు సమయాన్ని కూడా కేటాయించింది. సాధారణంగా ఇచ్చే సమయం కంటే రిజర్వ్ డే రోజున ఎక్కువ సమయం కేటాయించి, ఎలాగైనా విజేతను నిర్ణయించేలా ప్లాన్ చేశారు.

కేవలం సెమీఫైనల్ మాత్రమే కాదు, మార్చి 8న జరిగే గ్రాండ్ ఫైనల్‌కు కూడా ఇలాంటి నిబంధనలే వర్తిస్తాయి. నౌకౌట్ మ్యాచుల్లో కేవలం వాతావరణం వల్ల ఏ జట్టుకు అన్యాయం జరగకూడదనేది ఐసీసీ ఉద్దేశం. ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ అందరి కళ్లు వాంఖడే స్టేడియం పైనే ఉన్నాయి. సొంత గడ్డపై ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి రోహిత్ సేన ఫైనల్‌కు దూసుకెళ్లాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. అటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే పోరు కూడా హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది.

ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా వర్షం వల్ల పూర్తిగా రద్దయితే ఏమవుతుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తితే, సూపర్-8 దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ప్రతి పాయింట్, ప్రతి రన్ రేట్ ఇప్పుడు జట్లకు కీలకంగా మారాయి. మార్చి 8న జరిగే తుది పోరులో కిరీటం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026

అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్

5 March 2026

Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్…

మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?

5 March 2026

అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్

5 March 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. విచారం వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026

మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?

5 March 2026

అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.