Ibm Register With Stpi Visakhapatnam,విశాఖకు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. ఎస్‌టీపీఐలో ఐబీఎం రిజిస్ట్రేషన్, రూ.700 కోట్లతో – ibm india private limited official registered with stpi visakhapatnam
Visakhapatnam IBM Registered With STPI: ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో అడుగు పెట్టబోతోంది. ఐబీఎం విశాఖపట్నం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)లో రిజిస్టర్ చేసుకుంది. ‘ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నమోదు చేసుకున్నట్లు ఎస్‌టీపీఐ ట్వీట్ చేసింది. వచ్చే మూడేళ్లలో రూ. 322 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని తెలిపింది. ఐబీఎం రాకతో 502 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.
హైలైట్:
విశాఖపట్నానికి వస్తోన్న ఐబీఎం
ఎస్‌టీపీఐలో రిజిస్ట్రేషన్ పూర్తి
ఎక్స్‌లో తెలిపిన ఎస్‌టీపీఐ
విశాఖకు మళ్లీ ఐబీఎం రాక(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో విశాఖపట్నానికి వరుసగా ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటూ మరికొన్ని కంపెనీలు విశాఖకు ఎంట్రీ ఇచ్చాయి.. మరికొన్ని కంపెనీలు త్వరలోనే రాబోతున్నాయి. అయితే తాజాగా ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా విశాఖపట్నం రాబోతోంది. దీనికోసం ఐబీఎం ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా)లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఎస్‌టీపీఐ వెల్కం ఐబీఎం అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. విశాఖపట్నంలో ఐబీఎం మూడేళ్లలో రూ.321 కోట్ల విలువైన ఎక్స్‌పోర్ట్స్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐబీఎం రూ.700 కోట్లతో స్థానికంగా 502 మందికి ఉపాధి కల్పించనుంది. విశాఖపట్నంలో ఐబీఎం ఇప్పటికే అవసరమైన స్థలం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విశాఖపట్నంలోని రుషికొండ-3పై కెనెక్సా అనే కంపెనీ భారీగా భూమిని కేటాయించారు. మొత్తం 25 ఎకరాల్లో ఆ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ భూమిని ఐబీఎం తీసుకుంది. కానీ కొన్ని కారణాలతో ఐబీఎం తమకు 3.20 ఎకరాలు సరిపోతుందని చెప్పి.. మిగిలిన 21.80 ఎకరాల భూమిని తిరిగి ఏపీఐఐసీకి అప్పగించారు.
అయితే కరోనా సమయంలో ఐబీఎం తమ భవనాన్ని మరో సంస్థకు అమ్మేసి విశాఖపట్నం నుంచి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం ఐబీఎం వెనక్కు ఇచ్చిన 21.80 ఎకరాలను టీసీఎస్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఐబీఎం విశాఖపట్నానికి తిరిగి రావాలని నిర్ణయం తీసుకుని.. ఎస్‌టీపీఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. మరి ఐబీఎం విశాఖపట్నం ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు మరోవైపు ఇన్ఫోసిస్ శాశ్వతంగా క్యాంపస్ నిర్మించేందుకు ఎండాడలో 20 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తోంది. సాగర తీర నగరంవైపు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.. ఏపీ ప్రభుత్వం భూములతో పాటుగా ఆయా కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తోంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి