యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆన్‌లైన్ ప్రమోషన్లు, మరోవైపు ఆఫ్‌లైన్ ప్రమోషన్లను కూడా చెకాచెకా ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. అంతేనా అంటే కానే కాదు. టికెట్ రేట్ల హైక్స్ కోసం కూడా టీం గట్టిగా ప్రయత్నిస్తోందట. టాక్సిక్‌కి టికెట్ రేట్ల హైక్స్ ఇస్తే దురంధర్ సీక్వెల్‌కి కూడా ఇవ్వాల్సిందేగా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు దురంధర్ మేకర్స్. ఇప్పుడు అదే జోష్‌తో సెకండ్ పార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. సో ఈ సినిమాకు కూడా టికెట్స్ హైక్స్ కోసం ట్రై చేస్తున్నారు.

