Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Peddi Movie : రామ్ చరణ్ డ్యాన్స్ చిరు రియాక్షన్.. పెద్ది గురించి స్పెషల్ ట్వీట్..

3 March 2026

RRB Railway Admit Cards 2026: ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో

3 March 2026

Beetroot Benefits: బీట్‌రూట్‌తో సూపర్‌ టేస్టీ జ్యూస్‌లు.. రోజూ తాగారంటే మీ ఆరోగ్యం బంగారమే..!

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Mahanadu Junction Elevated Corridor Plan Again,విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్తగా 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి, రూ.668 కోట్లతో ప్లాన్ – ap govt likely to request nhai on vijayawada mahanadu junction elevated corridor plan again
ఆంధ్రప్రదేశ్

Vijayawada Mahanadu Junction Elevated Corridor Plan Again,విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్తగా 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి, రూ.668 కోట్లతో ప్లాన్ – ap govt likely to request nhai on vijayawada mahanadu junction elevated corridor plan again

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Mahanadu Junction Elevated Corridor Plan Again,విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్తగా 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి, రూ.668 కోట్లతో ప్లాన్ – ap govt likely to request nhai on vijayawada mahanadu junction elevated corridor plan again
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Request On Vijayawada Mahanadu Junction Elevated Corridor Plan Again: విజయవాడలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నేషనల్ హైవే 16 విజయవాడ నగరం మధ్యలో నుంచి వెళుతుండటంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకే గతంలో మహానాడు జంక్షన్ నిడమానూరు మధ్య ఎలివేటెడ్ వంతెనను ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్ అంశంపై తెరపైకి వచ్చింది.

హైలైట్:

  • విజయవాడలో మరో ఎలివేటెడ్ వంతెన
  • గతంలో ప్రతిపాదించినా పక్కన పెట్టారు
  • మరోసారి తెరపైకి వచ్చిన ప్రాజెక్టు
  • NHAIకు ఏపీ సర్కార్ నుంచి రిక్వెస్ట్
Vijayawada Mahanadu Junction Corridor
మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ వంతెనపై అప్డేట్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎంత ముఖ్యమో, పొరుగున ఉన్న విజయవాడ నగరం కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌, నేషనల్ హైవే 16 కనెక్టివిటీకి విజయవాడ కీలకంగా ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏపీ ప్రభుత్వం కొన్ని కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడకు వచ్చే జనాల సంఖ్య పెరిగింది.. ఈ ప్రభావం నగరంలో ట్రాఫిక్‌పై కూడా పడింది. కొంతకాలంగా విజయవాడలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నగరానికి బైపాస్‌లతో పాటుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును కూడా కనెక్ట్ చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ బ్రిడ్జి (కారిడార్)ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో ప్రతిపాదనలు తీసుకురాగా.. ఆ తర్వాత పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ బ్రిడ్జి ప్రతిపాదనపై కదలిక వచ్చింది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16 విజయవాడ నగరం మీదుగా వెళుతోంది. ఈ జాతీయ రహదారిలో విజయవాడ మహానాడు కూడలి నుంచి నిడమానూరు రైల్వే వంతెన అవతలి వరకు ఈ ఎలివేటెడ్ బ్రిడ్జిని నిర్మించాలని ప్లాన్ చేశారు. గతంలో ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఈ ప్రాజెక్టును రూ.668 కోట్లతో ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈ ఎలివేటెడ్ వంతెన ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనుకుంటున్న సమయంలో కొన్ని కారణాలతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పక్కన పెట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్‌ బ్రిడ్జి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ బ్రిడ్జి విజయవాడలో చాలా కీలకమంటూ.. ఆవశ్యకతను ఎన్‌హెచ్‌ఏఐ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ వంతెనను వన్‌టైమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కింద నిర్మించాలని రిక్వెస్ట్ చేయనుంది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16 విజయవాడ మధ్యలో నుంచి వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం మహానాడు కూడలి నుంచి నిడమానూరు రైల్వే వంతెన అవతలి వరకు బ్రిడ్జిని నిర్మించాలని కోరనుంది. మొత్తం 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెనను గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌ఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో డీపీఆర్‌ను కూడా సిద్ధం చేయించారు. మరి ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్‌పై ఎన్‌హెచ్‌ఏఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.. ఒకవేళ ఓకే చెబితే పాత డీపీఆర్‌‌ వైపు మొగ్గు చూపుతారా.. కొత్తగా మళ్లీ డీపీఆర్ సిద్ధం చేస్తారా అన్నది చూడాలి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్తగా ఎలివేటెడ్ వంతెనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి