అమరావతి, మార్చి 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళవారం (మార్చి 3) హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాల లాగిన్‌తో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయవల్సి ఉంటుంది. అనంతరం వాటిపై సంతకం, స్కూల్ స్టాంప్ వేసి విద్యార్థులకు అందజేయాలి. ఈ మేరకు విద్యార్ధులు వీటిని నేరుగా తమ పాఠశాలల్లోనే పొందవల్సి ఉంటుంది.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక పరీక్షలకు హాజరయ్యే ప్రైవేట్ అభ్యర్థులు మాత్రం అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వీటిల్లో విద్యార్ధులు తమ పేరు, రోల్ నంబర్, ఫొటో, పరీక్షా కేంద్రం, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలను సరిచూసుకోవల్సి ఉంటుంది. ఏవైనా తప్పులుంటే వెంటనే పాఠశాల అధికారులను సంప్రదించాలి. కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 30వ తేదీ వరకు మొత్తం 7 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమతోపాటు హాల్ టికెట్‌ను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లవల్సి ఉంటుంది.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..
- మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21న ఇంగ్లిష్ పరీక్ష (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
- మార్చి 23న మ్యాథమెటిక్స్
- మార్చి 25న ఫిజికల్ సైన్స్
- మార్చి 28న బయాలజికల్ సైన్స్ పరీక్ష
- మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

