రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. ఏ ఇండస్ట్రీ చూసినా పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఊహించని విధంగా కొన్ని బోల్తాకొడుతుంటాయి. మరికొన్ని పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యి సంచలన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్‌లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీల్లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి.. ఓటీటీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఏండ్ల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్
ఇక ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కూడా ఓటీటీలో అదరగొడుతుంది. కొన్నేళ్లుగా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. 180కోట్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా.. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022లో రిలీజైంది. ఈ సినిమాలో నటించిన వారందరూ పెద్ద స్టారే..
అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి
ఈ సినిమాలో సంజయ్ దత్, కరీనా కపూర్‌లాంటి స్టార్స్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా నటించారు. ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్ స్టోరీతో డైరెక్టర్ అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారె నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్స్‌లో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆమిర్ ఖాన్, నాగచైతన్య యాక్టింగ్‌కి మంచి మార్కులే పడినా ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ అల్ గా రూ. 120కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దాదాపు మూడేళ్ళుగా లాల్ సింగ్ చద్దా సినిమా ట్రెండింగ్ లో ఉంది.
అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

