Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

4 March 2026

Soubin Shahir: అది ఇళ్లా.. ఇంద్రభవనమా.. ? కూలీ విలన్ సౌబిన్ షాకిర్ ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే మావా..

4 March 2026

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Manchu Manoj: మంచు మనోజ్, మౌనికల పెళ్లిరోజు.. పిల్లలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్ ఇదిగో
తాజా వార్తలు

Manchu Manoj: మంచు మనోజ్, మౌనికల పెళ్లిరోజు.. పిల్లలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్ ఇదిగో

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Manchu Manoj: మంచు మనోజ్, మౌనికల పెళ్లిరోజు.. పిల్లలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్  ఇదిగో
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ – భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘భైరవం’, ‘మిరాయ్’ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేశారు. అతని అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్, మాస్ అప్పీల్‌ను ఈ సినిమాలు పునరుద్ఘాటించాయి. ప్రేక్షకుల్లో మనోజ్‌కి ఉన్న చెరగని ప్రేమకు, అభిమానానికి ఈ చిత్రాలకు లభించిన ఆదరణే నిదర్శనం.

ప్రస్తుతం మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇది ఇప్పటికే భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. ఇంకా మరిన్ని ప్రాజెక్టుల్ని మనోజ్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇక సినిమాలే కాకుండా మనోజ్ గత ఏడాది నవంబర్‌లో మోహన రాగ మ్యూజిక్‌ను ప్రారంభించారు. కొత్త వారిని, నూతన ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రపంచ వేదికపై తెలుగు సంగీతాన్ని ఉన్నతీకరించడానికి అంకితమైన మ్యూజిక్ లేబుల్‌గా ఇది రానుంది.

ఇవి కూడా చదవండి

మౌనిక సైతం తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ ఫౌండర్, సీఈవోగా స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా రిటైల్ స్టోర్‌లలో 75 వేల యూనిట్లకు పైగా విక్రయించారు. వీటిలో హామ్లీస్, మదర్‌కేర్, అమెజాన్, ఫస్ట్‌క్రై అన్నీ పూర్తిగా స్వయం నిధులతో, జీరో పెయిడ్ ప్రమోషన్‌లతో ఉన్నాయి. ఈ బ్రాండ్ రిలయన్స్‌తో పంపిణీ భాగస్వామ్యాన్ని పొందింది. ఇప్పుడు దాని డైరెక్ట్ టు కన్జ్యూమర్ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమవుతోంది. నమస్తే వరల్డ్‌ని మౌనిక కేవలం ఒక వ్యాపారంగా చూడటం లేదు. భారతదేశంలో తయారు చేసిన, సాంస్కృతికంగా పెనవేసుకున్న బొమ్మలను ప్రతి పిల్లల చేతుల్లోకి చేర్చాలని ఆమె తపిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనోజ్, మౌనిక జంటకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్.. అభిమానులు వారిపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వీరిద్దరి రాజకీయ ఎంట్రీ కోసం అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎవరు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో వేచి చూడాలి.

ఎన్ని కష్టాలు వచ్చినా మంచు మనోజ్, భూమా మౌనిక ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆ ధైర్యమే వారికి ప్రధాన బలం. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. కింది స్థాయి నుంచి జీవితాన్ని మొదలు పెట్టి ఇప్పుడు అందరూ మెచ్చుకునే స్థాయి వరకు ఎదిగారు. ఎప్పుడూ తమ వారి కోసం అందుబాటులో ఉంటుందీ జంట. ఇతరులకు సాయమందించడం, సేవలో చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి మనోజ్, మౌనికలు ఇంకా ఎన్నో వివాహా దినోత్సవాల్ని జరుపుకోవాలని, ఇలానే ఎప్పుడూ కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మంచు మనోజ్, భూమా మౌనికల ఫొటోస్..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

4 March 2026

Soubin Shahir: అది ఇళ్లా.. ఇంద్రభవనమా.. ? కూలీ విలన్ సౌబిన్ షాకిర్ ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే మావా..

4 March 2026

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? మార్చి 6 లేదా 7న బీసీసీఐ కీలక ప్రకటన

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

4 March 2026

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరువైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో…

Soubin Shahir: అది ఇళ్లా.. ఇంద్రభవనమా.. ? కూలీ విలన్ సౌబిన్ షాకిర్ ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే మావా..

4 March 2026

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

4 March 2026

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? మార్చి 6 లేదా 7న బీసీసీఐ కీలక ప్రకటన

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

4 March 2026

Soubin Shahir: అది ఇళ్లా.. ఇంద్రభవనమా.. ? కూలీ విలన్ సౌబిన్ షాకిర్ ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే మావా..

4 March 2026

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.