Kurnool Boy Aswarth Gurudatta Rs 26 Crores Fund: #SavePunarvika పేరుతో తెలుగు ప్రజలు చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టారు. ఏకంగా రూ.16 కోట్లు అందేలా చేశారు. కర్నూలుకు చెందిన మరో బాలుడు కూడా పునర్వికలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడి ప్రాణాలు నిలబడాలంటే రూ.26 కోట్ల ఇంజెక్షన్ అవసరం. మధ్యతరగతి కుటుంబానికి అంత ఖర్చు చేయాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. అందుకే దాతల సాయం కోరుతున్నారు.
హైలైట్:
- కర్నూలుకు చెందిన అశ్వర్థ్ గురుదత్తాకు అరుదైన వ్యాధి
- ప్రాణాలు నిలబడాలంటే రూ.26 కోట్ల ఇంజెక్షన్ కావాలి
- దాతల సాయం కోరుతున్న అశ్వర్థ్ తల్లిదండ్రులు

అశ్వర్థ్ తండ్రి హరీశ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో ఉద్యోగం చేసిన తల్లి మానేసి పిల్లవాడి బాగోగులు చూసుకుంటోంది. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయితే ఆ ఇంజెక్షన్ కోసం దాతల కోసం కోరారు.. గతేడాది ఇంపాక్ట్ గురు సంస్థ సహకారంతో క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఇంపాక్ట్ గురు ‘హెల్ప్ అశ్వర్థ్ గురుదత్తా’ పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తే 9 నెలల్లో రూ.40.67 కోట్లు మాత్రం విరాళాల రూపంలో వచ్చాయి. అయితే గత ఏడాది నుంచి బాలుడి ఆరోగ్యం క్షీణిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలుడు మంచానికి పరిమితం అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. బాలుడికి అవసరమైన స్టెరాయిడ్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, ఇతర మందులు ఇస్తున్నారు.
కర్నూలు జిల్లాకే చెందినచిన్నారి పునర్వికఎస్‌ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ ఇంపాక్ట్ గురు ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేశారు.. సోషల్ మీడియా, తెలుగ ప్రజల సాయంతో ఏకంగా రూ.10 కోట్లు సమకూరాయి. మంత్రి లోకేష్ మిగిలిన రూ.6 కోట్లకు హామీ ఇచ్చారు. పునర్వికకు ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. పునర్వికలాగే తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని అశ్వర్థ్ గురుదత్తా తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలుడి తండ్రి ఏపీ మంత్రి టీజీ భరత్‌ను కలిసి తన కుమారుడి ఆరోగ్య సమస్యను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత సాయం అందేలా చూస్తానని మంత్రి భరత్ చెప్పారు. అశ్వర్థ్ గురుదత్త తండ్రి హరీశ్‌కుమార్ మొబైల్ నంబర్లు 9700365341, 9490992981. దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే.. బ్యాంకు అకౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.. ఈడిగ హరీష్‌కుమార్ గౌడ్, అకౌంట్ నంబర్-2346000100134082, IFSC Code- PUNB0234600


