Five Killed In Road Accident Near Chittoor District: చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేలో వెళుతున్న ఓ కారు లారీ కిందుకు దూసుకెళ్లడంతో ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
హైలైట్:
- చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఘోర రోడ్డుప్రమాదం
- పలమనేరు దగ్గర లారీ కిందకు దూసుకెళ్లిన కారు
- ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు

తిరుపతి జిల్లాలో యువకుడు మృతి
తిరుపతి జిల్లాలో ఓ యువకుడు అతిగా మద్యం తాగా కాలువలో పడి చనిపోయాడు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటో డ్రైవర్ దివాకర్ స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ మద్యం కొనడానికి డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి లిక్కర్ షాపునకు వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. అయితే మురుగుకాలువ దగ్గర పడి చనిపోయాడు. మంగళవారం రోజు పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చనిపోయిన యువకుడు షర్ట్ లేకుండా ఉండటంపై అనుమానాలువ్యక్తమయ్యాయి. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఘటనా స్థలానికి సమీపంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వృద్ధుడు చెరువులో పడి చనిపోయాడు. స్థానికంగా ఆవుల మేపుతూ జీవనం సాగిస్తున్న గంగాధరం చిత్తూరు రూరల్ మండలం బండపల్లిలో చెరువు దగ్గర సాయంత్రం కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు జారిపడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


