Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వంట విషయంలో అత్తా-కోడలు ఘర్షణ.. తెల్లారేసరికల్లా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!

4 March 2026

SM PORT Jobs 2026: నెలకు రూ.1,60 వేల జీతంతో.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

4 March 2026

మీ ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు వస్తున్నాయా.. ఇది మంచిదేనా లేక చెడుకి సంకేతమా?

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kiran Royal Janasena 70 Seats,ఈసారి జనసేన 70కి పైగా స్థానాల్లో పోటీ.. టీడీపీ నేతలకు కిరణ్ రాయల్ ఛాలెంజ్.. – kiran royal wants to give more than 70 seats to janasena party in 2029 ap assembly elections
ఆంధ్రప్రదేశ్

Kiran Royal Janasena 70 Seats,ఈసారి జనసేన 70కి పైగా స్థానాల్లో పోటీ.. టీడీపీ నేతలకు కిరణ్ రాయల్ ఛాలెంజ్.. – kiran royal wants to give more than 70 seats to janasena party in 2029 ap assembly elections

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kiran Royal Janasena 70 Seats,ఈసారి జనసేన 70కి పైగా స్థానాల్లో పోటీ.. టీడీపీ నేతలకు కిరణ్ రాయల్ ఛాలెంజ్.. – kiran royal wants to give more than 70 seats to janasena party in 2029 ap assembly elections
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 70కిపైగా స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన నేత, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరణ్ రాయల్.. ఎన్నికల పొత్తులు, సీట్ల లెక్కలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లేకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చేది కాదని.. టీడీపీ ఎలక్షన్ కూడా చేయలేకపోయేదన్నారు. గతంతో పోలిస్తే తమ బలం పెరిగిందన్న కిరణ్ రాయల్.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మళ్లీ 21 సీట్లు ఇస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు.

Kiran-Royal
ఈసారి జనసేన 70కి పైగా స్థానాల్లో పోటీ.. కిరణ్ రాయల్(ఫోటోలు– Samayam Telugu)
జనసేన తిరుపతి నియోజకవర్గం ఇంఛార్జి కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా 70కిపైగా స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. 2024 ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం పెరిగిందన్న కిరణ్ రాయల్.. 21 సీట్లే ఇస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేకుంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేది కాదన్న కిరణ్ రాయల్.. జనసేన లేకుంటే టీడీపీ ఎలక్షన్ కూడా చేయలేకపోయేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను టీడీపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులు అయోమయ పరిస్థితులలో ఉన్న సమయంలో కూటమి కట్టి.. అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ రాయల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మురోవైపు 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ర్, చంద్రబాబు కలవకపోయి ఉంటే మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవారని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను నమ్మి జనం ఓటేశారని అన్నారు. రాజకీయాల్లో ఉండాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ప్రజాబలంతో పాటుగా ఆర్థిక బలం కూడా ఉండాలన్న కిరణ్ రాయల్.. ఆర్థిక బలంగా అంతగా లేకపోవటంతోనే గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినట్లు తెలిపారు. తనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, హరిప్రసాద్‌కు విభేదాలు ఉన్నాయనే ప్రచారంపైనా కిరణ్ రాయల్ స్పందించారు. తాము ఎక్కడున్నా, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కోసమే పనిచేస్తున్నామని అన్నారు. వైసీపీ నుంచి కొంతమంది జనసేనలో చేరారని.. వారు ఇప్పుడిప్పుడే తమ పార్టీకి అలవాటు పడుతున్నారని కిరణ్ రాయల్ చెప్పారు.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీచేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన.. వందశాతం స్ట్రైయిక్ రేట్ నమోదు చేసింది. అనంతరం ప్రభుత్వంలో చేరిన జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు వరించాయి.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. నాదెండ్ల మనోహర్ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా, కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం పెరిగిందంటున్న కిరణ్ రాయల్.. ఈసారి తమకు 70కి పైగా సీట్లు కావాలని ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి