ఈమధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మన స్టార్ హీరోల గురించి పిచ్చి పిచ్చి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. హీరో రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, నాగార్జున స్త్రీల సామాన్ల ఫ్యాక్టరీ ఉందని ఏవేవో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీల ద్వారా హీరోలు ఎంత సంపాదిస్తున్నారో కూడా ఈ వీడియోల్లో చెప్తున్నారు. ఇవన్నీ ఫేక్ వీడియోలు అని చాలా మందికి తెలుసు. తాజాగా కమెడియన్ అలీ గురించి కూడా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై అలీ రియాక్ట్ అయ్యారు. అలీ రియాక్షన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకూ అలీకి ఉన్న ఫ్యాక్టరీ ఏంటో తెలుసా.?
750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
అలీకి హైదరాబాద్ లో గాజుల వ్యాపారం ఉందని దాని ద్వారా ఆయన బాగా సంపాదిస్తున్నాడని.. ఒకరోజు బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు మాట్లాడుకుంటుంటే విని గాజుల ఫ్యాక్టరీ తాను కూడా స్టార్ట్ చేయాలనీ అలీ భావించి గాజుల ఫ్యాక్టరీ పెట్టారని.. హైదరాబాద్ లో అలీ అమ్ముతున్న గాజులు ముంబైలో తయారు అవుతున్నాయని ఆ వీడియోలో ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈవీడియో పై అలీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.. ముంబైలో గాజుల ఫ్యాక్టరీ ఏంట్రా..? ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో చెప్పారా.? గాజుల వ్యాపారం చేస్తున్నానట అంటూ నవ్వుకున్నారు అలీ. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అలీ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. కేవలం అలీ కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ టీవీ షోలో అలీతో సరదాగా అనే షో చేస్తున్నారు. అలాగే సినిమాలతోనూ మెప్పిస్తున్నారు అలీ.
Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ
ALI gari Gajula vyaparam 🤣🤣🤣 pic.twitter.com/2oxRAO6KrI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) March 4, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

